ఏంటా గెటప్‌; ‘అంత డబ్బు సంపాదించలేదు’ | Janhvi Kapoor Hilarious Response To Trolls On Repeating Outfit | Sakshi
Sakshi News home page

ఇంకా అంత డబ్బు సంపాదించలేదు : జాన్వీ

Apr 8 2019 2:34 PM | Updated on Apr 8 2019 2:49 PM

Janhvi Kapoor Hilarious Response To Trolls On Repeating Outfit - Sakshi

వేసిన డ్రెస్సులే మళ్లీ మళ్లీ వేసుకుంటున్నారు. ఇది హీరోయిన్‌ లక్షణం కాదు.

హీరోయిన్‌ అంటే తళుకుబెళుకులు, మేకప్‌తో పాటు ప్రతీసారి ఓ కొత్తలుక్‌తో ఆకట్టుకోవాలని అభిమానులు ఆశపడటం సహజం. అయితే కనిపించిన ప్రతీసారి కొత్త డ్రెస్‌తో అలరించడం, ప్రతీ ఒక్కరిని రంజింపజేయడం తన వల్ల కాదు అంటోంది అందాల నటి శ్రీదేవి- నిర్మాత బోనీ కపూర్‌ల తనయ జాన్వీ కపూర్‌. ఇటీవలి కాలంలో.. ‘జాన్వీ ఎప్పుడు బయటికి వచ్చినా ఒకే రకమైన వస్త్రధారణతో కనిపిస్తున్నారు. వేసిన డ్రెస్సులే మళ్లీ మళ్లీ వేసుకుంటున్నారు. ఇది హీరోయిన్‌ లక్షణం కాదు. ఏంటా గెటప్‌’ అంటూ కొంతమంది ఆమెను ట్రోల్‌ చేస్తున్నారు.

ఈ క్రమంలో ఓ షోకు హాజరైన జాన్వీ మాట్లాడుతూ.. ‘ అందరినీ ఆనందపరచటం, మెప్పించడం ఒక్కోసారి సాధ్యం కాకపోవచ్చు. అలా అని డ్రెస్సింగ్‌ గురించి నాపై వస్తున్న విమర్శలను సీరియస్‌గా తీసుకోలేను. నటన నా వృత్తి. దానిని సక్రమంగా నిర్వర్తిస్తా. అంతేకాని జిమ్‌ బయట ఎలా కనిపించాలన్నది, ఎలాంటి దుస్తులు ధరించాలన్నది నా ఇష్టం. ఇంకోవిషయం.. ప్రతీరోజూ కొత్త బట్టలు వేసుకునేంత డబ్బు ఇంకా సంపాదించలేదు’ అంటూ నవ్వుతూనే ట్రోల్స్‌కు గట్టి సమాధానమిచ్చారు. కాగా ధడక్‌ మూవీతో బాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చిన జాన్వీ ప్రస్తుతం.. వార్‌ ఎపిక్‌ డ్రామా ‘థక్త్‌’ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇందులో తొలిసారిగా బాబాయ్‌ అనిల్‌ కపూర్‌తో స్క్రీన్‌ షేర్‌ చేసుకుంటున్న ఆమె.. భారత వైమానిక పైలట్‌ గుంజన్‌ సక్సేనా బయెపిక్‌ ‘కార్గిల్‌ గర్ల్‌’ సినిమా టైటిల్‌ రోల్‌లో కనిపించనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement