
ఆ సినిమా కోసం 10 కిలోలు తగ్గా..
అతి మేధావిగళ్ చిత్రం కోసం 10 కిలోల బరువు తగ్గానని చెప్పుకొచ్చింది నటి ఇషానాయర్.
అతి మేధావిగళ్ చిత్రం కోసం 10 కిలోల బరువు తగ్గానని చెప్పుకొచ్చింది నటి ఇషానాయర్. ఆ మధ్య చతురంగవేట్టై చిత్రంలో నట్టికి జంటగా అమాయక పాత్రలో నటించి తమిళ ప్రేక్షకులకు దగ్గరైన నటి ఈ మలయాళ కుట్టి. ఆ చిత్రంతో సక్సెస్‌ను తన ఖాతాలో వేసుకున్నా ఆ తరువాత కనిపించకుండా పోయిన ఈ భామ ఇటీవల మళ్లీ కోలీవుడ్‌లో కనిపించడం మొదలెట్టింది. తాజాగా ఇషానాయర్ నటించిన చిత్రం అతి మేధావిగళ్.
బుల్లితెర యాంకర్, మొ చిత్రం ఫేమ్ సురేశ్‌రవి కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రాన్ని అబ్జలూట్ పిక్చర్స్ పతాకంపై మాల్‌కామ్ నిర్మిస్తున్నారు. నవ దర్శకుడు రంజిత్ మణికంఠన్ పరిచయం అవుతున్న ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని త్వరలో తెరపైకి రావడానికి సిద్ధం అవుతోంది. ఈ సందర్భంగా చిత్ర నాయకి ఇషానాయర్ తన అనుభవాలను పంచుకుంటూ తన గత చిత్రాల ఛాయలు ఉండరాదని చిత్రాల ఎంపికలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్న తరుణంలో వచ్చిన అవకాశం ఈ అతి మేధావుగళ్ చిత్రం అని చెప్పింది. ఈ చిత్రంలో నటించడం కొత్త అనుభవంగా పేర్కొంది.
ఇందులో హీరోహీరోయిన్ల మధ్య ప్రేమ సన్నివేశాలు ఉండవని, స్నేహమే ఉంటుందని తెలిపింది. అయినా చిత్రం అంతా ఇద్దరూ కలిసే ఉంటారని చెప్పింది. ఇంజినీరింగ్ చదవడం ఇష్టం లేని హీరోహీరోయిన్లు అదే విద్యను ఒకే కాలేజీలో చదువుతారన్నారు. అయితే ఆ ఇంజినీరింగ్ విద్య నుంచి బయట పడటానికి వారు చేసే ప్రయత్నాలే అతి మేధావుగళ్ చిత్రం అని తెలిపింది. ప్రస్తుత చిత్రాలకు పూర్తి భిన్నంగా ఆసక్తికరమైన సన్నివేశాలతో ప్రేక్షకులకు మంచి వినోదాన్ని పంచే చిత్రంగా ఉంటుందని చెప్పింది. ఇందులో సుజీ పాత్రలో కథానాయకిగా నటించడానికి తాను 10 కిలోల బరువు తగ్గి కళాశాల విద్యార్థినిగా మారానని చెప్పింది. ఈ చిత్రం తన కేరీర్‌కు చాలా హెల్స్ అవుతుందనే నమ్మకం ఉందని చిత్ర విడుదల కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నట్లు నటి ఇషానాయర్ పేర్కొంది.