breaking news
Suresh Ravi
-
‘చంద్రేశ్వర’ మూవీ రివ్యూ
ప్రస్తుతం ప్రేక్షకులు సినిమా చూసే కోణంలో చాలా ఛేంజ్ వచ్చింది. కంటెంట్ ఉంటేనే థియేటర్లకు వస్తున్నారు. రొటీన్ చిత్రమే అని టాక్ వస్తే చాలు, ఆ సినిమా వైపు అసలు చూడను కూడా చూడటం లేదు. ఓటీటీలు వచ్చిన తర్వాతే ఈ మార్పు వచ్చింది. కొన్ని రోజులుగా కంటెంట్ బేస్డ్ ఫిల్మ్‌తో వస్తున్నట్లుగా ‘చంద్రశ్వేర’ మూవీ టీమ్ చెబుతూ వస్తుంది. అందులోనూ ఆర్కియాలజీ నేపథ్యంలో పురాతన కాలం నాటి ఓ గుడికి సంబంధించిన స్టోరీ లైన్‌తో ‘చంద్రేశ్వర’ తెరకెక్కిందని, ఈ సినిమా అందరూ చూడాలని మేకర్స్ చెబుతూ వచ్చారు. మరి ఇందులో ఉన్న విషయం ఏమిటి? అది ప్రేక్షకులకు ఎంత వరకు రీచ్ అవుతుంది? రివ్యూలో తెలుసుకుందాం.‘చంద్రేశ్వర’ కథేంటంటే.. నందివర్మ పర్వతం కింద పురాతన కాలంనాటి ఓ గుడి కప్పెట్టబడి ఉందని, ఆ గుడి లోపల నిధి ఉందని తెలిసి ఆర్కియాలజీ విభాగానికి చెందిన ఎమ్‌డి చక్రవర్తి (నిళల్గళ్ రవి), ఓ టీమ్‌ని ఆ పర్వతం ఉన్న చంద్రగిరికి పంపిస్తాడు. ప్రొఫెసర్ బోస్ (బోసే రవి) ఆధ్వర్యంలో అతనితో కలిపి 8 మంది టీమ్ ఆ గ్రామానికి వెళుతుంది. కానీ, ఆ గ్రామ ప్రజలు, వారిని ఊరిలోకి రానివ్వకుండా అడ్డుకుంటారు. అంతకు ముందు కూడా ఇలాగే కొందరు వచ్చి చేసిన పనులతో ఊరిలో ఎవరో ఒకరు చనిపోతూనే ఉన్నారని అడ్డుకుంటారు. ఎలాగోలా వారిని ఒప్పించి, బోస్ టీమ్ అక్కడ తవ్వకాలను చేపడుతుంది. కాకపోతే చీకటి పడిన తర్వాత ఆ గ్రామంలో ఎవరూ తిరగకూడదు. ఎవరైనా అలా ప్రయత్నిస్తే దారుణంగా చనిపోతుంటారు. అప్పుడే చంద్రగిరికి సబ్ ఇన్స్పెక్టర్గా వచ్చిన గురు వర్మ (ఆశ వెంకటేష్), ఆ చావులు వెనుక ఉన్న వాస్తవాలను తెలుసుకోవడానికి, తన స్టైల్లో ఇన్వెస్టిగేషన్ మొదలు పెడతాడు. ఈ క్రమంలో ఆర్కియాలజీ టీమ్‌లోని అఖిల (ఆశ వెంకటేష్)తో ప్రేమలో పడతాడు. ఇక తన ఇన్విస్టిగేషన్లో గురు వర్మ సంచలన విషయాలు తెలుసుకుంటాడు. ఆ విషయాలు ఏంటి? ఆ ఊరిలో చావులకు కారణం ఏంటి? గురు వర్మ ఈ సమస్యను ఎలా సాల్వ్ చేశాడు? నిజంగానే ఆ గ్రామంలో గుడి, అందులో నిధి ఉన్నాయా? అనేది తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే.ఎలా ఉందంటే..ఆర్కియాలజీ నేపథ్యంలో ఇంతకు ముందు చాలా సినిమాలే వచ్చాయి కానీ, ఇందులో ఆసక్తికరమై కథ, స్క్రీన్‌ప్లేతో చూస్తున్న ప్రేక్షకులకు కనువిందు కలిగిస్తాడు దర్శకుడు. ముఖ్యంగా ఇంటర్వెల్‌కు ముందు వచ్చే సన్నివేశం ఈ సినిమాకు హైలైట్ అని చెప్పవచ్చు. సినిమా స్టార్టింగ్ సీనే.. ఒక గొప్ప సినిమా చూడబోతున్నామనే అనుభూతిని కలిగిస్తుంది. ఆ తర్వాత నందివర్మ, విషయ్ గౌడ ఎపిసోడ్.. ఈ సినిమాకు బలం. అది మిస్సయితే ఈ సినిమా ఏం అర్థం కాదు. మేకర్స్ పోస్టర్లో ‘ప్రారంభం మిస్ కాకండి’ అని ప్రింట్ చేయించి ఉండాల్సింది. సినిమాపై ఇంకాస్త ఇంట్రస్ట్ వచ్చేది. ఒక రాజుని ఓడించాలంటే.. ముందు వారి ఆచార వ్యవహారాలపై దెబ్బకొట్టాలనే డైలాగ్, సనాతన పద్దతులను చూపించిన విధానం, హిస్టారికల్ ఎవిడెన్స్ వంటి పదాలు, విగ్రహాల మార్పిడి ఇవన్నీ కూడా దర్శకుడి మేధస్సుని తెలియజేస్తాయి.గుడి విశిష్టతను తెలిపే ఎపిసోడ్, అదృశ్య ఖడ్గంతో పాటు నిధి కోసం అఖిల చెప్పే 4 సీక్రెట్ దారులు వంటి వన్నీ కూడా సినిమాలో లీనమయ్యేలా చేస్తాయి. కాస్త పేరున్న నటీనటులు కనుక ఇందులో నటించి ఉంటే, అలాగే ద్వితీయార్థంపై ఇంకాస్త శ్రద్ధ పెట్టి ఉంటే సినిమా ఫలితం మరోలా ఉండేది.ఎవరెలా చేశారంటే.. సబ్ ఇన్స్పెక్టర్గా సురేష్ రవి ఆహార్యం బాగుంది. ఫస్ట్ సీన్లోనే అతని టాలెంట్ ఏంటో చెప్పే ప్రయత్నం బాగుంది. ఆ తర్వాత చంద్రగిరి వచ్చినప్పటి నుంచి ఆయన చేసే ఇన్విస్టిగేషన్ అందరినీ సినిమాలో లీనమయ్యేలా చేస్తుంది. ఎందుకంటే, ఆ ట్విస్ట్‌లన్నింటికీ చెక్ పెట్టేది అతనే. పురాతన గ్రాంథిక భాష తెలిసిన ఎక్స్‌పర్ట్‌గా ఆర్కియాలజీ టీమ్‌లో కీలక పాత్ర పోషించే అఖిల పాత్రలో ఆశ వెంకటేష్ మెప్పిస్తుంది. తన అందంతోనూ, అలాగే ప్రేమికురాలిగా, టీమ్ సభ్యురాలిగా వైవిధ్యంగా కనిపించే అవకాశం ఆమెకు దక్కింది. చక్రవర్తిగా నిళల్గళ్ రవి, ప్రొఫెసర్ బోస్‌గా బోసే రవి, గ్రామ పెద్దగా చేసిన అతను, ఇంకా ఆర్కియాలజీ టీమ్ మెంబర్స్ అంతా వారి పాత్రల పరిధిమేర నటించారు.సాంకేతిక నిపుణుల విషయానికి వస్తే.. ఈ సినిమాకు ప్రధాన హైలెట్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్. సినిమా కొద్దిగా డౌన్ అవుతున్న ప్రతిసారి సంగీత దర్శకుడు అలా నిలబెట్టేశాడు. అఖిల అఖిల పాట బాగుంది. సినిమాటోగ్రపీ కూడా పురాతన రోజులకు తీసుకెళుతుంది. మొదట్లో వచ్చే విజువల్స్ అన్నీ కూడా సినిమాపై ఆసక్తిని కనబరుస్తాయి. ఎడిటింగ్ పరంగా ఫస్టాఫ్‌లో కొన్ని సీన్లు ట్రిమ్ చేసి ఉండొచ్చు. ఉన్నంతలో అయితే సినిమా బాగానే ఉంది. నిర్మాణ విలువలు కథకు అనుగుణంగా ఉన్నాయి. నటీనటులు: సురేశ్ రవి, ఆశ వెంకటేష్, నిళల్గళ్ రవి, బోసే వెంకట్, ఆడుకాలం మురుగదాస్, జెఎస్కె గోపి తదితరులుసంగీతం: జెరాడ్ ఫిలిక్స్డిఓపి: ఆర్వీ సీయోన్ ముత్తుఎడిటర్: నందమూరి హరినిర్మాత: డా. రవీంద్ర చారిడైరెక్టర్: జీవీ పెరుమాళ్ వర్ధన్విడుదల తేదీ: 27 జూన్, 2025 -
Chandreshwara: జూన్ 27న మరో మహాశివుని చిత్రం విడుదల
ఈ నెల 27న కన్నప్ప రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. అదే రోజు మరో శివుడు బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన మరో చిత్రం కూడా రిలీజ్ కానుంది. అదే ‘చంద్రేశ్వర’. ‘అదృశ్య ఖడ్గం’ అనేది ట్యాగ్‌లైన్. ఆర్కియాలజీ సస్పెన్స్ అండ్ హారర్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రానికి జీవి పెరుమాళ్ వర్ధన్ దర్శకత్వం వహించగా, సురేష్ రవి, ఆశా వెంకటేష్ హీరో హీరోయిన్లుగా నటించారు. శివ బాలాజీ ఫిలింస్ పతాకంపై డాక్టర్ రవీంద్ర చారి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటి వరకు విడుదలైన పోస్టర్స్, టీజర్‌కు మంచి స్పందన లభించింది. జూన్ 27న ఈ చిత్రం గ్రాండ్‌గా రిలీజ్ కాబోతుంది.ఈ సందర్భంగా నిర్మాత రవీంద్ర చారి మాట్లాడుతూ.. ఈ వారంలో రెండు భక్తి సినిమాలు ఒకటి ‘కన్నప్ప’, రెండు ‘చంద్రేశ్వర’ పోటాపోటీగా విడుదలవుతున్నాయి. ఈ రెండు సినిమాలు బ్రహ్మాండమైన విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నాము. దర్శకుడు అద్భుతంగా ఈ సినిమాను రూపొందించారు. చివరి నిమిషం వరకు ఈ సినిమా అత్యంత ఉత్కంఠ భరితంగా ప్రేక్షకులను సినిమాలో లీనమయ్యేలా చేస్తుంది. ఎటువంటి అశ్లీలత ఇందులో ఉండదు. సెన్సార్ నుంచి క్లీన్ యు సర్టిఫికెట్ వచ్చింది. ప్రేక్షకులు ఈ సినిమాను చూసేందుకు థియేటర్లకు తరలివచ్చి బ్రహ్మాండమైన సక్సెస్ చేస్తారని కోరుకుంటున్నాము. ఈ జర్నీలో నాకు సహకరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు’’ అని తెలిపారు. -
ఆ సినిమా కోసం 10 కిలోలు తగ్గా..
అతి మేధావిగళ్ చిత్రం కోసం 10 కిలోల బరువు తగ్గానని చెప్పుకొచ్చింది నటి ఇషానాయర్. ఆ మధ్య చతురంగవేట్టై చిత్రంలో నట్టికి జంటగా అమాయక పాత్రలో నటించి తమిళ ప్రేక్షకులకు దగ్గరైన నటి ఈ మలయాళ కుట్టి. ఆ చిత్రంతో సక్సెస్‌ను తన ఖాతాలో వేసుకున్నా ఆ తరువాత కనిపించకుండా పోయిన ఈ భామ ఇటీవల మళ్లీ కోలీవుడ్‌లో కనిపించడం మొదలెట్టింది. తాజాగా ఇషానాయర్ నటించిన చిత్రం అతి మేధావిగళ్. బుల్లితెర యాంకర్, మొ చిత్రం ఫేమ్ సురేశ్రవి కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రాన్ని అబ్జలూట్ పిక్చర్స్ పతాకంపై మాల్కామ్ నిర్మిస్తున్నారు. నవ దర్శకుడు రంజిత్ మణికంఠన్ పరిచయం అవుతున్న ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని త్వరలో తెరపైకి రావడానికి సిద్ధం అవుతోంది. ఈ సందర్భంగా చిత్ర నాయకి ఇషానాయర్ తన అనుభవాలను పంచుకుంటూ తన గత చిత్రాల ఛాయలు ఉండరాదని చిత్రాల ఎంపికలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్న తరుణంలో వచ్చిన అవకాశం ఈ అతి మేధావుగళ్ చిత్రం అని చెప్పింది. ఈ చిత్రంలో నటించడం కొత్త అనుభవంగా పేర్కొంది. ఇందులో హీరోహీరోయిన్ల మధ్య ప్రేమ సన్నివేశాలు ఉండవని, స్నేహమే ఉంటుందని తెలిపింది. అయినా చిత్రం అంతా ఇద్దరూ కలిసే ఉంటారని చెప్పింది. ఇంజినీరింగ్ చదవడం ఇష్టం లేని హీరోహీరోయిన్లు అదే విద్యను ఒకే కాలేజీలో చదువుతారన్నారు. అయితే ఆ ఇంజినీరింగ్ విద్య నుంచి బయట పడటానికి వారు చేసే ప్రయత్నాలే అతి మేధావుగళ్ చిత్రం అని తెలిపింది. ప్రస్తుత చిత్రాలకు పూర్తి భిన్నంగా ఆసక్తికరమైన సన్నివేశాలతో ప్రేక్షకులకు మంచి వినోదాన్ని పంచే చిత్రంగా ఉంటుందని చెప్పింది. ఇందులో సుజీ పాత్రలో కథానాయకిగా నటించడానికి తాను 10 కిలోల బరువు తగ్గి కళాశాల విద్యార్థినిగా మారానని చెప్పింది. ఈ చిత్రం తన కేరీర్‌కు చాలా హెల్స్ అవుతుందనే నమ్మకం ఉందని చిత్ర విడుదల కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నట్లు నటి ఇషానాయర్ పేర్కొంది.