
31 రోజుల్లో షూట్ చేసేశాడు..!
అష్టా చమ్మా, అంతకు ముందు ఆతరువాత, జెంటిల్మన్ లాంటి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు
అష్టా చమ్మా, అంతకు ముందు ఆతరువాత, జెంటిల్మన్ లాంటి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ. జెంటిల్మన్ సినిమాతో సూపర్ హిట్ కొట్టిన ఇంద్రగంటి నాగచైతన్య హీరోగా ఓ సినిమాను తెరకెక్కించాలని భావించాడు. అయితే చైతు డేట్స్ కాలీ లేకపోవటంతో ఈ గ్యాప్ లో ఓ కామెడీ ఎంటర్టైనర్ ను రెడీ చేస్తున్నాడు. అమీ తుమీ పేరులో అవసరాల శ్రీనివాస్, అడవి శేష్, వెన్నెల కిశోర్ ప్రధాన పాత్రల్లో ఓ సినిమాను రూపొందించాడు.
ఈ సినిమాను దర్శకుడు ఇంద్రగంటి మోహన కృష్ణ కేవలం 31 రోజుల్లో పూర్తి చేశాడు. ఈ సందర్భంగా తనకు సహకరించిన నటీనటులకు యూనిట్ సభ్యులకు సోషల్ మీడియా ద్వారా కృతజ్ఞతలు తెలిపాడు. గ్రీన్ టీ ప్రొడక్షన్స్ పతాకం పై తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఈషా, అదితి మాయకల్ లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు.
IT'S A WRAP FOR 'AMI TUMI'👍 IN THIRTY ONE DAYS FLAT😊 THANKS TO THE ZANY AND BRILLIANT CAST AND THE DEDICATED CREW👏👏 NOW OFF TO POST😊
— Mohan Indraganti (@mokris_1772) 22 March 2017