హాలీవుడ్‌లో హార్రర్... | horror in hollywood | Sakshi
Sakshi News home page

హాలీవుడ్‌లో హార్రర్...

Sep 27 2015 11:01 PM | Updated on Sep 3 2017 10:05 AM

హాలీవుడ్‌లో హార్రర్...

హాలీవుడ్‌లో హార్రర్...

ఐశ్వర్యా రాయ్, మల్లికా శెరావత్ హాలీవుడ్ చిత్రాల్లో నటించిన విషయం తెలిసిందే. ప్రియాంక చోప్రా అమెరికన్ టీవీ సిరీస్

ఐశ్వర్యా రాయ్, మల్లికా శెరావత్ హాలీవుడ్ చిత్రాల్లో నటించిన విషయం తెలిసిందే. ప్రియాంక చోప్రా అమెరికన్ టీవీ సిరీస్ ‘క్వాంటికో’లో నటించి, ఆ విధంగా హాలీవుడ్ రంగప్రవేశం చేశారు. ఇప్పుడీ తారల జాబితాలో జాక్వెలిన్ ఫెర్నాండెజ్ చేరనున్నారు. ఇప్పటికే హిందీలో పలు క్రేజీ ప్రాజెక్ట్స్‌లో నటిస్తున్న ఈ బ్యూటీ ఓ హాలీవుడ్ చిత్రంలో నటిస్తున్నారు. ‘డెఫినిషన్ ఆఫ్ ఫియర్’ పేరుతో రూపొందుతున్న ఈ చిత్రానికి జేమ్స్ సింప్సన్ దర్శకుడు. నలుగురు అమ్మాయిలు హాలిడే ట్రిప్ కోసం ఏకాంతంగా గడపడానికి పెద్ద అపార్ట్‌మెంట్‌లో దిగుతారు. కానీ అనుకోకుండా జరుగుతున్న సంఘటనలు వాళ్లకు ముచ్చెమటలు పట్టిస్తాయి. రహస్యంగా తమను ఎవరో  గమనిస్తున్నారన్న సంగతి అర్థమవుతుంది. ఆ తర్వాత వీళ్లేం చేశారు? అనే కథాంశంతో తెరకెక్కిన హార్రర్ మూవీ ఇది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement