'మాస్టర్ పీస్' అంటున్నారు! | fans says baahubali movie is a masterpiece | Sakshi
Sakshi News home page

'మాస్టర్ పీస్' అంటున్నారు!

Jul 10 2015 9:10 AM | Updated on Sep 3 2017 5:15 AM

'మాస్టర్ పీస్' అంటున్నారు!

'మాస్టర్ పీస్' అంటున్నారు!

భారీ అంచనాల మధ్య విడుదలైన ప్రతిష్టాత్మక సినిమా 'బాహుబలి' అభిమానులను అలరిస్తోంది.

హైదరాబాద్: భారీ అంచనాల మధ్య విడుదలైన ప్రతిష్టాత్మక సినిమా 'బాహుబలి' అభిమానులను అలరిస్తోంది. సినిమా చూసిన వారందరూ సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. 'మాస్టర్ పీస్' అంటూ పొగిడేస్తున్నారు. రాజమౌళి హాలీవుడ్ స్థాయిలో తీశాడంటూ ప్రశంసిస్తున్నారు.

పాత్రలు వేటికవే సాటిగా ఉన్నాయని తెలిపారు. ముఖ్యపాత్రధారులు విశ్వరూపం చూపించారని మెచ్చుకున్నారు. ముఖ్యంగా రమ్యకృష్ణ గొప్పగా నటించారని చెబుతున్నారు. అవంతికగా తమన్నా ఒదిగిపోయిందని అంటున్నారు. హీరో ప్రభాస్, విలన్ దగ్గుబాటి రానా పోటీపడీ నటించారని తెలిపారు. క్లైమాక్స్ లో 45 నిమిషాలు సాగిన యుద్ధసన్నివేశాలు హైలెట్ గా నిలిచాయని తెలిపారు. ప్రొడక్షన్ వాల్యూస్ టాప్ రేంజ్ లో ఉన్నాయన్నారు.

ఇక సినిమా ప్రముఖులు కూడా మాస్టర్ పీస్ అంటూ పొగుడుతున్నారు. ప్రస్తుతం వస్తున్న స్పందనను బట్టి చూస్తే 'బాహుబలి' భారీ హిట్ అయ్యే అవకాశముందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement