
మళ్లీ నేనిక తిరిగిరాను. అందుకని నాకెలాంటి విచారం లేదు
లాస్ ఏంజిల్స్: ఈవిల్ డెడ్-2 నటుడు డానీ హిక్స్ క్యాన్సర్ బారినపడ్డారు. ఆయనకు స్టేజ్ 2గా తేలింది. 68 ఏళ్ల డానీ హిక్స్ ఈ విషయాన్ని ఫేస్‌బుక్‌లో వెల్లడించారు. ‘నేనెప్పుడూ ప్రత్యక్షంగా కలుసుకోని నా అభిమానులకు, 6018 మంది ఫేస్‌బుక్ ఫాలోవర్స్‌కు ఓ బ్యాడ్ న్యూస్. నాకు స్టేజ్-4 క్యాన్సర్‌గా నిర్ధారణ అయింది. బహుశా నేను ఇంకో రెండు లేదా మూడేళ్లు మాత్రమే బతుకుతాను కావొచ్చు’అని ఆయన బాధాతప్త హృదయంతో రాసుకొచ్చారు. ‘మీకో విషయం చెప్పాలి. నా 68 సంవత్సరాల నరకప్రాయ జీవితం ఇక ముగిసిపోతుంది. మళ్లీ నేనిక తిరిగిరాను. అందుకని నాకెలాంటి విచారం లేదు’అని ఆయన పేర్కొన్నారు. ఈవిల్ డెడ్-2లో జేక్‌గా డానీ హిక్స్ అభిమానులకు సుపరిచితం. డార్క్‌మాన్, ఇంట్రూడర్, స్పైడర్‌మాన్-2 సినిమాల్లో ఆయన నటించారు.
(చదవండి: లులు కసరత్తులు చేస్తోంది : ఆర్నాల్డ్)