దర్శకుడిగా మారనున్న హీరో | Ee Nagaraniki Emaindi Fame Vishwaksen Turns Director | Sakshi
Sakshi News home page

Oct 6 2018 1:51 PM | Updated on Oct 6 2018 4:47 PM

Ee Nagaraniki Emaindi Fame Vishwaksen Turns Director - Sakshi

టాలీవుడ్ నటులుగా సక్సెస్‌ సాధించి దర్శకులుగా మారుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. ఇప్పటికే అవసరాల శ్రీనివాస్‌, వెన్నెల కిశోర్‌ తాజాగా రాహుల్ రవీంద్రన్‌ దర్శకులుగా మారి సత్తా చాటారు. వీరిలో వెన్నెల కిశోర్‌ సక్సెస్‌ కాలేకపోయినా అవసరాల, రాహుల రవీంద్రన్‌లు విజయం సాదించారు. తాజాగా ఈ లిస్ట్‌లో మరో హీరో చేరేందుకు రెడీ అవుతున్నాడు.

తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ నగరానికి ఏమైంది..? సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు విశ్వక్‌సేన్‌ మెగాఫోన్‌ పట్టేందుకు రెడీ అవుతున్నాడు. వెళ్లిపోమాకే సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఈ యువ నటుడు గతంలో ఓ షార్ట్‌ఫిలింస్‌కు దర్శకత్వం వహించాడు. ప్రస్తుతం ‘అంగమలై డైరీస్‌’ అనే మలయాళ సినిమాను తెలుగులో రీమేక్‌ చేసే ప్రయత్నాల్లో ఉన్నాడు విశ్వక్‌సేన్‌. త్వరలోనే ఈ ప్రాజెక్ట్‌పై అధికారిక ప్రకనట వెలువడనుంది.

Advertisement
 
Advertisement
Advertisement