‘ఈ కథలో పాత్రలు కల్పితం’లో మరో పాత్ర రివీల్‌ | Ee Kathalo Paathralu Kalpitam Movie Another Poster Released | Sakshi
Sakshi News home page

‘ఈ కథలో పాత్రలు కల్పితం’లో పృథ్వీరాజ్‌ పాత్ర రివీల్‌

Feb 23 2020 8:56 PM | Updated on Feb 23 2020 8:59 PM

Ee Kathalo Paathralu Kalpitam Movie Another Poster Released - Sakshi

పవన్‌ తేజ్‌ కొణిదెల హీరోగా పరిచయం చేస్తూ మాధవి సమర్పణలో రూపొందుతోన్న సినిమా 'ఈ కథలో పాత్రలు కల్పితం'. ఎంవిటి ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బేనర్‌పై అభిరామ్‌ ఎం. దర్శకత్వంలో రాజేష్‌ నాయుడు నిర్మిస్తున్నారు. మేఘన హీరోయిన్‌. ఇటీవల విడుదలైన ఫస్ట్, సెకండ్‌ లుక్‌ పోస్టర్లకి మంచి స్పందన లభించింది.

 మొదటి రెండు పోస్టర్లలో హీరో లుక్‌ను మాత్రమే విడుదల చేసిన చిత్ర బృందం..ఇప్పుడు మిగతా పాత్రలు పోషించిన వారి లుక్స్‌ని ఒక్కొక్కటిగా రివీల్‌ చేస్తోంది. దీనిలో భాగంగా ఆదివారం బబ్లూ పృథ్వీరాజ్‌ పాత్రను విడుదల చేసింది చిత్ర బృందం. రాజీవ్‌ కృష్ణ పేరుతో పోలీసు అధికారి పాత్రలో పృథ్వీరాజ్‌ సీరియస్‌గా కనిపించారు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాకి కార్తీక్‌ కొడకండ్ల సంగీతమందిస్తుండగా సునీల్‌ కుమారన్‌ సినిమాటోగ్రఫి అందిస్తున్నారు. మెగా ఫ్యామిలీ నుంచి వస్తున్న హీరో కాబట్టి ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement