బ‌న్నీ డ్యాన్స్‌పై బాలీవుడ్‌ హీరోయిన్‌ అనుమానం | Disha Patani Raises Doubt On Allu Arjun Dance In His Butta Bomma Song | Sakshi
Sakshi News home page

అల్లు అర్జున్‌ను పొగిడిన బాలీవుడ్‌ బ్యూటీ

Mar 31 2020 4:02 PM | Updated on Mar 31 2020 4:14 PM

Disha Patani Raises Doubt On Allu Arjun Dance In His Butta Bomma Song - Sakshi

బుట్ట‌బొమ్మ పాట టాలీవుడ్ నుంచి బాలీవుడ్ దాకా మార్మోగిపోయిన విష‌యం గుర్తుండే ఉంటుంది. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ న‌టించిన అల వైకుంఠ‌పురం సినిమాలోని పాట‌ల‌న్నీ సూప‌ర్ హిట్‌గా రికార్డు సృష్టించాయి. ఇక బుట్ట‌బొమ్మ పాట‌కు బాలీవుడ్ తార‌లు సైతం స్టెప్పులేసి సంబ‌ర‌ప‌డిపోయారు. కానీ బాలీవుడ్ బ్యూటీ దిశా ప‌టానీకి ఆశ్చ‌ర్యం, అనుమానం ఒకేసారి క‌లిగాయి. ఈ పాట‌లో అంత‌ బాగా ఎలా డ్యాన్స్ చేయ‌గ‌లిగార‌ని బ‌న్నీని ఇన్‌స్టాగ్రామ్‌లో ప్ర‌శ్నించింది. దీనికి మ‌న హీరో స‌మాధాన‌మిస్తూ "నాకు సంగీతం అంటే ఎంతో ఇష్టం. అందులోనూ మంచి మ్యూజిక్ దొరికితే డ్యాన్స్ చేయ‌కుండా ఉంటానా.. మీ ప్ర‌శంస‌కు ధ‌న్య‌వాదాలు" అంటూ రిప్లై ఇచ్చాడు. (కరోనా: పాజిటివ్‌ వార్తను చెప్పిన హీరో)

"మా అంద‌రికీ ఎంతో స్ఫూర్తినిస్తున్నందుకు ముందుగా మీకు కృతజ్ఞతలు" అని దిశా పేర్కొంది. కాగా బ‌న్నీ గారాల కొడుకు అయాన్‌కు దిశా ప్రియుడు, యాక్ష‌న్ హీరో టైగ‌ర్ ష్రాఫ్‌కు అభిమాని అన్న విష‌యం తెలిసిందే. ఈ విష‌యాన్ని స్వ‌యంగా అయాన్‌ త‌న ముద్దు ముద్దు మాట‌ల‌తో చెప్తూ "టైగర్‌ స్క్వాష్‌" అని నిక్‌నేమ్ కూడా పెట్టేశాడు. దీనికి ఆ బాలీవుడ్ హీరో స్పందిస్తూ త‌న‌ అన్ని సినిమాల షూటింగ్‌ల‌కు అయాన్ ఆహ్వానితుడే అని పేర్కొన్నాడు. అంతేకాదు.. బుడ్డోడు పెట్టిన నిక్‌నేమ్ చాలా న‌చ్చింద‌ని చెప్పుకొచ్చాడు. కాగా సుకుమార్‌ దర్శకత్వంలో అల్లు అర్జున్‌ హీరోగా మైత్రీ మూవీ మేకర్స్‌ పతాకంపై ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇందులో రష్మికా మందన్నా కథానాయికగా న‌టిస్తోంది. (ప్రియుడితో దిశా పటాని ఐటం సాంగ్‌!)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement