
ఆఫ్ స్క్రీన్ అయినా... ఆన్‌స్క్రీన్ అయినా హీరో రవితేజ ఎనర్జీలో ఉండదు తేడా. సెట్‌లో ఆయన సందడి మొదలయ్యే సమయం ఆసన్నమైంది. ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా, ఒక్కక్షణం’ ఫేమ్ వీఐ ఆనంద్ దర్శకత్వంలో రవితేజ హీరోగా ‘డిస్కోరాజా’ అనే చిత్రం తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఎస్‌ఆర్‌టీ ఎంటర్‌టైన్మెంట్స్ పతాకంపై రామ్ తాళ్లూరి నిర్మించనున్నారు. ఇందులో పాయల్‌రాజ్‌పుత్, నభా నటేష్ కథానాయికలుగా నటిస్తారు. మరో కథానాయిక పేరును చిత్రబృందం త్వరలో ప్రకటించనున్నట్లు తెలిసింది. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఈ నెల 5న హైదరాబాద్‌లో ప్రారంభం కానుందని తెలిసింది. సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో సాగే ఈ చిత్రానికి సాయి శ్రీరామ్ ఛాయాగ్రాహకునిగా చేస్తారు. ఎస్.ఎస్ తమన్ స్వరకర్త.