అసురుడు | Dhanush releases first look of his upcoming film Asuran | Sakshi
Sakshi News home page

అసురుడు

Dec 24 2018 3:43 AM | Updated on Dec 24 2018 3:43 AM

Dhanush releases first look of his upcoming film Asuran - Sakshi

కొన్ని కాంబినేషన్‌లు ఎన్నిసార్లు కుదిరినా ఆడియన్స్‌ మొదటిసారిలానే ఎగై్జటింగ్‌గా ఫీల్‌ అవుతారు. తమిళంలో హీరో ధనుశ్, డైరెక్టర్‌ వెట్రిమారన్‌లది అలాంటి కాంబినేషనే. ‘పొల్లాదవన్, ఆడుకళమ్, వడ చెన్నై’తో హ్యాట్రిక్‌ హిట్స్‌ అందుకున్న వీరు మరో సినిమాకు కలసి పని చేయనున్నారు. ‘అసురన్‌’ అనే టైటిల్‌తో రూపొందబోయే ఈ చిత్రం పొలిటికల్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కనుంది.

వి. క్రియేషన్స్‌ బ్యానర్‌పై యస్‌.థాను ఈ చిత్రాన్ని నిర్మిసున్నారు. అలాగే ధనుష్‌ నటించిన లేటెస్ట్‌ చిత్రం ‘మారి 2’ తెలుగులో మంచి టాక్‌తో దూసుకుపోతుందని తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేసిన శ్రీరామ్‌ తెలిపారు. ‘‘అన్ని వర్గాల ప్రేక్షకులకు స్పందన బావుంది. సెకండాఫ్‌లో ఫ్యామిలీ సెంటిమెంట్‌కు అందరూ కనెక్ట్‌ అవుతున్నారు. అందుకే వచ్చే వారం నుంచి మరికొన్ని థియేటర్స్‌ యాడ్‌ చేయనున్నాం’’ అని శ్రీరామ్‌ అన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement