యువ రాక్షసుడు

Dhanush new movie second look from Asuran unveiled - Sakshi

సినిమా సినిమాకు లుక్స్‌ మార్చే హీరోల్లో తమిళ నటుడు ధనుష్‌ ఒకరు. ఒకే సినిమాలో విభిన్నమైన పాత్రల్లో కనిపిస్తుంటారు. ప్రస్తుతం ధనుష్‌ ‘అసురన్‌’ (రాక్షసుడు అని అర్థం) అనే సినిమా చేస్తున్నారు. వెట్రిమారన్‌ దర్శకుడు. గతంలో వీరి కాంబినేషన్‌లో ‘పొల్లాదవన్, ఆడుకళం, వడ చెన్నై’ సినిమాలు వచ్చాయి. ‘అసురన్‌’ సినిమాలో ధనుష్‌ సెకండ్‌ లుక్‌ను రిలీజ్‌ చేశారు. ఈ సినిమాలో రెండు విభిన్న గెటప్స్‌లో ధనుష్‌ కనిపిస్తారు. యంగ్‌ ఏజ్‌లో లుక్‌ ఒకటి. ఓల్డ్‌ ఏజ్‌ లుక్‌ మరోటి. వృద్ధుడిగా ఉన్న లుక్‌ను ఇంతకుముందే రిలీజ్‌ చేసేశారు. ఆ లుక్‌కి మంచి స్పందన వచ్చింది. ఇప్పుడు రిలీజ్‌ చేసిన యంగ్‌ లుక్‌ కూడా బాగుందంటున్నారు. ‘వేక్కై’ అనే తమిళ నవల ఆధార ంగా తెరకెక్కిన ఈ సినిమా అక్టోబర్‌ 4న విడుదల కానుంది.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Taboola - Feed

Back to Top