దేవదాస్‌ సెంటిమెంట్‌ | Devdas Gets A New Release Date | Sakshi
Sakshi News home page

దేవదాస్‌ సెంటిమెంట్‌

Jul 13 2018 12:36 AM | Updated on Aug 3 2019 12:30 PM

Devdas Gets A New Release Date - Sakshi

అశ్వనీదత్‌

ఎన్నో సూపర్‌హిట్‌ చిత్రాలను ప్రేక్షకులకు అందించి ఇండస్ట్రీలో ఉన్నత స్థానంతో పాటుగా మంచి పేరు కూడా సంపాదించుకుంది అశ్వనీదత్‌ ‘వైజయంతీ మూవీస్‌’ సంస్థ. ఈ సంస్థ నుంచి వచ్చే సినిమాల పట్ల ప్రేక్షకుల్లో కూడా అంచనాలు ఉంటాయి. ఇక సెప్టెంబర్‌ నెల వైజయంతీ మూవీస్‌కు ఎంత ప్రత్యేకమైనదో చెప్పక్కర్లేదు. దాదాపు 24 ఏళ్ల క్రితం ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో జగపతిబాబు, ఆమని, రోజా నటించిన ‘శుభలగ్నం’ సెప్టెంబర్‌లో విడుదలై విశేష ప్రేక్షకాదరణ పొందింది.

అలాగే దాదాపు పదిహేడేళ్ల క్రితం ఎన్టీఆర్‌ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో అశ్వనీదత్‌ ఒక నిర్మాతగా తెరకెక్కిన ‘స్టూడెంట్‌ నెం.1’ చిత్రం సెప్టెంబర్‌ 27న విడుదలై, బంపర్‌ హిట్‌ సాధించింది. పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో అశ్వనీదత్‌ నిర్మించిన రామ్‌చరణ్‌ పరిచయ చిత్రం ‘చిరుత’ కూడా సెప్టెంబర్‌ 28న రిలీజై బాక్సాఫీస్‌ వద్ద హిట్‌ సాధించింది. ఇప్పుడు ఈ ఏడాది సెప్టెంబర్‌ 27న వైజయంతీ మూవీస్‌ నిర్మాణంలో తెరకెక్కిన మల్టీస్టారర్‌ మూవీ ‘దేవదాస్‌’ రిలీజ్‌కు సిద్ధమైంది.

నాగార్జున, నానీ హీరోలుగా శ్రీరామ్‌ ఆదిత్య తెరకెక్కిస్తున్నారు. ఆకాంక్ష సింగ్, రష్మిక కథానాయికలు. సెప్టెంబర్‌ సెంటిమెంట్‌తో వస్తోన్న ‘దేవదాస్‌’ చిత్రం కూడా హిట్‌ అవుతుందని చిత్రబృందం విశ్వాసంగా ఉంది. ఇదిలా ఉంటే.. చిరంజీవి నటించిన ‘జగదేకవీరుడు అతిలోక సుందరి’ రిలీజైన మే 9నే ఈ ఏడాది ‘మహానటి’ విడుదలై బ్లాక్‌బస్టర్‌ అయ్యింది. సో.. సెంటిమెంట్‌గా ఆలోచిస్తే.. ‘దేవదాస్‌’ కూడా హిట్టే అని చిత్రబృందం చెబుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement