దీప్‌వీర్‌ వెడ్డింగ్‌ : రోజుకు రూ 24.75 లక్షలు | Deepika And Ranveer Wedding In Lake Como | Sakshi
Sakshi News home page

దీప్‌వీర్‌ వెడ్డింగ్‌ : రోజుకు రూ 24.75 లక్షలు

Nov 13 2018 2:02 PM | Updated on Nov 13 2018 2:02 PM

Deepika And Ranveer Wedding In Lake Como - Sakshi

ఆ పెళ్లి వేడుకకు డబ్బును మంచినీళ్లలా వెచ్చిస్తున్నారు..

ముంబై : దీపిక పడుకోన్‌, రణ్‌వీర్‌సింగ్‌లు ఇటలీలోని లేక్‌ కోమోలో ఈనెల 14, 15 తేదీల్లో అంగరంగ వైభవంగా జరిగే వివాహంతో ఒక్కటవుతున్న క్రమంలో కళ్లు చెదిరే ఏర్పాట్లతో పెళ్లి వేదిక ముస్తాబవుతోంది. ఇటలీలో ఈ హాట్‌ కపుల్‌ డెస్టినేషన్‌ వెడ్డింగ్‌కు వేదికైన విల్లా డెల్‌ బాల్బినెల్లో సర్వాంగ సుందరంగా సిద్ధమైంది. పెళ్లికొడుకు రణ్‌వీర్‌సింగ్‌ సీప్లేన్‌లో వేదికకు వచ్చేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. సింధ్‌ సంప్రదాయం ప్రకారం, దక్షిణాది పద్ధతిలో రెండు సంప్రదాయాలను ప్రతిబింబిస్తూ పెళ్లి వేడుక జరగనుంది. పెళ్లి మంటపాన్ని అలంకరించేందుకు ఫ్లోరెన్స్‌ నుంచి పన్నెండు మంది పుష్పాలంకరణ నిపుణులను రప్పించారు.

పెళ్లి వేడుక జరిగే విల్లాలో ఎవరూ విడిది చేయకపోవడంతో కొత్త జంటతో పాటు అతిధులందరికి పక్కనే ఉన్న బ్లెవియో విలేజ్‌లోని రిసార్ట్‌ అంతటినీ బుక్‌ చేశారు. అత్యంత ఖరీదైన ఈ రిసార్ట్‌నూ పూలతో అలంకరించారు. ఈ రిసార్ట్స్‌లో నాలుగు రెస్టారెంట్లు, బార్లు, కాన్ఫరెన్స్‌ రూమ్‌లు, స్పా, ఇండోర్‌ స్విమ్మింగ్‌పూల్‌ ఉన్నాయి.

26,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో విస్తరించిన రిసార్ట్స్‌ను కలియతిరిగేందుకు గోల్ఫ్‌ కార్ట్స్‌ అందుబాటులో ఉంచారు. ఈ రిసార్ట్ప్‌లో ఒక్కో​ రూమ్‌కు రోజుకు రూ 33,000 వసూలు చేస్తారు. మొత్తం 75 రూమ్‌లకు వారం రోజులకు గాను 1.73 కోట్లు ఖర్చు చేస్తున్నారు. రిసార్ట్స్‌ నుంచి పెళ్లి వేదికకు చేరుకునేందుకు అతిధుల కోసం ఇప్పటికే రణ్‌వీర్‌ ప్రత్యేక నౌకలను బుక్‌ చేశారు. ఇక అతిధులకు పెళ్లి విందులో నోరూరించే వంటకాలను సిద్ధం చేసేందుకు స్విట్జర్లాండ్‌ నుంచి చెఫ్‌లు లేక్‌కోమో చేరుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement