దీప్‌వీర్‌ పెళ్లి హంగామా

Ahead of Deepika Padukone and Ranveer Singh's wedding - Sakshi

దీప్‌వీర్‌ (దీపికా పదుకోన్‌ – రణ్‌వీర్‌ సింగ్‌)ల పెళ్లి హంగామా మొదలైంది. ఇటలీలో డెస్టినేషన్‌ వెడ్డింగ్‌ చేసుకోవడానికి శనివారం ముంబై నుంచి ప్రయాణమయ్యారు. దీప్‌వీర్‌ విడివిడిగా ముంబై ఎయిర్‌పోర్ట్‌కి చేరుకున్నారు. ఇద్దరూ తెలుపు రంగు దుస్తులే ధరించడం చూపురులను ఆకర్షించింది.  కొన్ని కెమెరాలు క్లిక్‌మన్నాయి. ఇక్కడున్న ఫొటోలు అవే. ఈ నెల 14,15 తేదీల్లో దీప్‌వీర్‌ పెళ్లి జరగనున్న సంగతి తెలిసిందే. పెళ్లి తర్వాత బెంగళూరులో ఒకటి, ముంబైలో మరొక రిసెప్షన్‌ ఏర్పాటు చేయాలని ప్లాన్‌ చేశారు. అలాగే వివాహం కూడా రెండు సంప్రదాయాల్లో జరగనున్న సంగతి తెలిసిందే.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top