రెండేళ్ల కష్టాన్నే మీరిప్పుడు చూస్తున్నారు!

రెండేళ్ల కష్టాన్నే మీరిప్పుడు చూస్తున్నారు!


‘‘గ్లామర్, పర్‌ఫార్మెన్స్‌... మీ ఓటు దేనికి? అనడిగితే... హీరోయిన్స్‌ ఎవరైనా రెండోదానికే ఓటేస్తారు. మంచి క్యారెక్టర్స్‌ చేయాలనుందని చెబుతారు. నేనూ అంతే. కానీ, తెలుగు సినిమాల్లో అలాంటి పాత్రలు దొరకడం కొంచెం కష్టం. నాకు దొరుకుతున్నాయి. ‘సుప్రీమ్‌’లో బెల్లం శ్రీదేవిగా నటనకు ఆస్కారమున్న పాత్రలోనూ, కొన్ని సిన్మాల్లో గ్లామరస్‌గా కనిపించా.గ్లామర్, పర్‌ఫార్మెన్స్‌... రెండిటినీ నేను ఎంజాయ్‌ చేస్తా’’ అన్నారు హీరోయిన్‌ రాశీ ఖన్నా. ఎన్టీఆర్‌ హీరోగా కె.ఎస్‌. రవీంద్ర (బాబీ) దర్శకత్వంలో నందమూరి కల్యాణ్‌రామ్‌ నిర్మించిన ‘జై లవకుశ’లో ఓ హీరోయిన్‌గా నటించారీమె. వచ్చే గురువారం (ఈ నెల 21న) ఈ సినిమా ప్రేక్షకుల ముందుకొస్తున్న సందర్భంగా రాశీ ఖన్నాతో చిట్‌చాట్‌...
ట్రైలర్‌లో మీ ఫ్రెండ్‌తో నిశ్చితార్థానికి రెడీ అయ్యి, పీటల మీద కూర్చున్నాక ‘లవ’ మీకు ఐలవ్యూ చెబుతాడు... అతన్నెలా లవ్‌ చేశారు?

(నవ్వుతూ...) సినిమా చూస్తే తెలుస్తుందది. ఇప్పుడు చెబితే... సినిమా చూస్తున్నప్పుడు కిక్‌ ఏముంటుంది?

     

► పోనీ, మీ పాత్రేంటో చెప్తారా?

ప్రియ అనే అమ్మాయిగా నటించా. మ్యారేజ్‌ బ్యూరో నడుపుతుంటుంది. ప్రచార చిత్రాల్లో చూపించినట్టుగా ‘లవ’ ప్రేయసి.

     

► జై, లవ, కుశ... మూడు పాత్రల్లో మీకేది నచ్చింది? సెట్స్‌లో ఎన్టీఆర్‌ ఎలా ఉండేవారు?

మూడింటిలో ఒకటి సెలక్ట్‌ చేయడం కష్టమే. కానీ, నాకు ‘జై’ అంటే ఇష్టం. ‘ఎన్టీఆర్‌ ఈజ్‌ ఎ బ్రిలియంట్‌ యాక్టర్‌’ అని అందరూ చెబుతుంటే విన్నా. సెట్స్‌లో లైవ్‌గా నేనే చూశాను. హి ఈజ్‌ వెరీ ఎనర్జిటిక్, డెడికేటెడ్, టాలెంటెడ్‌ అండ్‌ ప్యాషనేటెడ్‌! ఇప్పటికి ఇటువంటి మాటలు వందసార్లు వినుంటారు. కానీ, నేను లైవ్‌గా చూశా. ఒక్కో రోజు సెట్స్‌లో 70 డ్రస్సులు  ఛేంజ్‌ చేసుకునేవారు. ఎంతో ఓపికగా ఉంటే తప్ప అలా చేయలేం. ఓ పక్క సినిమా... మరో పక్క బిగ్‌ బాస్‌... నిద్ర లేకున్నా ఎక్కడా ఎనర్జీ తగ్గకుండా షూటింగ్‌ చేసేవారు. ఎన్టీఆర్‌ డెడికేషన్, హార్డ్‌వర్క్‌కి హ్యాట్సాఫ్‌.

     

► స్టార్‌... యాక్టర్‌... డ్యాన్సర్‌... ఎన్టీఆర్‌లో మీరు ఇష్టపడేది?

అతని వ్యక్తిత్వం ఇష్టం. వెరీ డౌన్‌ టు ఎర్త్‌! చాలా మంచి వ్యక్తి. గర్వం అనేది అసలు లేదు.

     

► ఎన్టీఆర్‌తో డ్యాన్స్‌ చేయడానికి కష్టపడ్డారా?

ఆల్రెడీ సాయిధరమ్‌ తేజ్, రామ్‌లతో సిన్మాలు చేశా కదా. అందువల్ల, అంత కష్టంగా అనిపించలేదు. కానీ, కొంచెం కష్టమే. మేనేజ్‌ చేశా!

     

► మీరు, నివేథా థామస్, నందిత... ముగ్గురు హీరోయిన్లున్నారు. మీ పాత్రకు ఎంత ఇంపార్టెన్స్‌ ఉంది?

నా పాత్రకు ప్రాముఖ్యత ఉంటుందా? లేదా? అనే భయం ముందు నాలోనూ ఉండేది. కానీ, బాబీ ప్రతి పాత్రను బాగా రాశారు. అతను కథ చెప్పినప్పుడు నా పాత్ర బాగా నచ్చింది. నాతో పాటు మిగతా పాత్రలకూ ఇంపార్టెన్స్‌ ఉంది! సినిమా చూస్తే... అరే, రాశీ పాత్ర పాసింగ్‌ క్లౌడ్‌లా ఉందని ఎవరూ అనుకోరు. ‘ప్రియ’ ఎవ్వరినీ డిజప్పాయింట్‌ చేయదు. నివేథా పాత్ర కూడా బాగుంటుంది. సెట్స్‌లో తనని కలవడానికి ముందే నేను ‘నిన్ను కోరి’ చూశా. నువ్వు చాలా దూరం వెళ్తావనీ, నటిగా మరింత పేరు తెచ్చుకుంటావనీ నివేథాతో చెప్పా! షి ఈజ్‌ ఫ్రెండ్లీ.►  తెలుగు బాగా మాట్లాడుతున్నారు. డబ్బింగ్‌ ఎప్పుడు చెబుతారు?

నాకూ చెప్పాలనుంది. బాబీ కూడా డబ్బింగ్‌ చెప్పమన్నారు. కానీ, టైమ్‌ లేదు. తెలుగు, తమిళ్, మలయాళ భాషల్లో సినిమాలు చేస్తున్నా. బిజీగా ఉండడంతో చెప్పలేకపోయా! మోహన్‌లాల్‌గారితో మలయాళంలో ‘విలన్‌’ చేయడం మంచి ఎక్స్‌పీరియన్స్‌.► దేవిశ్రీ స్టార్స్‌తో పాటలు పాడిస్తారు. మీరు సింగర్‌ కూడానూ! ఇందులో ఒక్క పాట కూడా పాడలేదెందుకు?

తారక్‌తో, నాతో ‘ట్రింగ్‌... ట్రింగ్‌..’ పాటను దేవిశ్రీ పాడించాలనుకున్నారు. అప్పుడు తారక్‌ ‘బిగ్‌ బాస్‌’తో బిజీ. సో, కుదరలేదు. వరుణ్‌తేజ్‌తో నటిస్తున్న ‘తొలిప్రేమ’లో పాడుతున్నా. ‘ఊహలు గుసగుసలాడే’ తర్వాత నేను చేస్తున్న ప్రేమకథా చిత్రమది. ‘విలన్‌ ’లో టైటిల్‌ సాంగ్, నారా రోహిత్‌ ‘బాలకృష్ణుడు’లో రెండు పాటలు పాడా.

     

► ‘రాజా... ది గ్రేట్‌’లో స్పెషల్‌ అప్పియరెన్స్‌ ఇస్తున్నారు. కథేంటి?

    ఓ పాటలో చిన్న అతిథి పాత్ర చేశా. దర్శకుడు అనిల్‌ రావిపూడి అడిగితే నేను, సాయిధరమ్‌ తేజ్‌ చిన్న బిట్‌లో స్టెప్పులేశామంతే. దీనికి నేను చాలా రెమ్యునరేషన్‌ తీసుకున్నానని కొందరు రాశారు.

     

► రీసెంట్‌గా రెమ్యునరేషన్‌ పెంచారని టాక్‌?

‘జై లవ కుశ’ తర్వాత తప్పకుండా రెమ్యునరేషన్‌ పెరుగుతుంది! కానీ, ఎంతని మాత్రం అడగొద్దు! ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ ప్రాబ్లమ్స్‌ వస్తాయి.

     

► ఏంటి... ఈ మధ్య బాగా సన్నబడ్డారు?

ఫిట్‌నెస్‌ కోసమే. నేనేమీ ఒక్క రోజులో సన్నబడలేదు. రెండేళ్ల నుంచి  కష్టపడుతున్నా. రిజల్ట్‌ ఇప్పుడు కనబడుతోంది.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top