సుశాంత్‌ ఎందుకిలా చేశావ్‌: వాట్సన్‌ | Can Not Stop Thinking About Sushanth Demise Shane Watson | Sakshi
Sakshi News home page

సుశాంత్‌ ఎందుకిలా చేశావ్‌: వాట్సన్‌

Jun 15 2020 5:31 PM | Updated on Jun 15 2020 6:17 PM

Can Not Stop Thinking About Sushanth Demise Shane Watson - Sakshi

సుశాంత్‌ ఎందుకిలా చేశాడో ఆలోచించడం ఆపలేకపోతున్నానని తెలిపారు.

దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన బాలీవుడ్‌ యంగ్‌ హీరో సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ ఆత్మహత్య ఘటనపై సినీ, క్రీడా ప్రముఖులు తీవ్ర విచారం వెలిబుచ్చారు. గొప్ప ప్రతిభ, కష్టపడి సంపాదించుకున్న పేరు ప్రతిష్టలు ఉన్నప్పటికీ సుశాంత్‌ బలవన్మరణానికి పాల్పడటం కలచివేస్తోందని అంటున్నారు. తాజాగా ఆస్ట్రేలియా స్టార్‌ క్రికెటర్‌ షేన్‌ వాట్సన్‌ సుశాంత్‌ మృతిపట్ల నివాళి అర్పించారు. చక్కని ప్రతిభ త్వరగా కనుమరుగైపోయిందని ట్విటర్‌లో పేర్కొన్నాడు.
(చదవండి: డిప్రెష‌న్‌ను జ‌యించండిలా..)

సుశాంత్‌ ఎందుకిలా చేశాడో ఆలోచించడం ఆపలేకపోతున్నానని తెలిపారు. ‘ఇది చాలా విషాదకర ఘటన. ఎంఎస్‌ ధోని: ది అన్‌టోల్డ్‌ స్టోరీ సినిమా చూస్తున్న సమయంలో నటిస్తోంది ధోనియా, సుశాంతా అనే విషయం మర్చిపోయి చక్కని అనుభూతి పొందా. ఆ సినిమాలో సుశాంత్‌ అత్యద్భుతంగా నటించి వినోదం పంచాడు. అంతలోనే ఈ ప్రపంచాన్ని ఒంటరి చేసి దిగంతాలకు పయనమయ్యాడు. గొప్ప ప్రతిభ త్వరగా కనుమరుగైంది’అని వాట్సన్‌ ట్వీట్‌ చేశాడు.
(చదవండి: ఆవేదన వ్యక్తం చేసిన ‘బిగ్‌ బీ’)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement