మెగా150 మొబైల్ గేమ్ లాంచ్ | Boss in game mega 150 game Teaser | Sakshi
Sakshi News home page

మెగా150 మొబైల్ గేమ్ లాంచ్

Jan 4 2017 1:15 PM | Updated on Sep 5 2017 12:24 AM

మెగా150 మొబైల్ గేమ్ లాంచ్

మెగా150 మొబైల్ గేమ్ లాంచ్

మెగాస్టార్ రీ ఎంట్రీని అన్ని రకాలుగా ప్రమోట్ చేసేందుకు రకరకాల ప్లాన్ చేస్తున్నారు మెగా టీం. ఇప్పటికే భారీగా ప్రమోట్ చేస్తూ సినిమా మీద అంచనాలు పెంచేస్తున్న చిత్రయూనిట్,

మెగాస్టార్ రీ ఎంట్రీని అన్ని రకాలుగా ప్రమోట్ చేసేందుకు రకరకాల ప్లాన్ చేస్తున్నారు మెగా టీం. ఇప్పటికే భారీగా ప్రమోట్ చేస్తూ సినిమా మీద అంచనాలు పెంచేస్తున్న చిత్రయూనిట్, సినిమాను జనాలకు చేరువ చేసేందుకు అవకాశం ఉన్న అన్ని మార్గాలను ట్రై చేస్తోంది. బాలీవుడ్ తరహాలో సినిమా రిలీజ్కు ముందు ఓ మొబైల్ గేమ్ను రిలీజ్ చేయనుంది. తాజాగా ఈ గేమ్కు సంబంధించిన టీజర్ ఒకటి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.

చిరంజీవి సినిమాల్లోని క్యారెక్టర్లను పోలిన పాత్రలు ఈ గేమ్లో దర్శనమివ్వనున్నాయి. ఖైదీ, అడవిదొంగ సినిమాలతో పాటు జగదేకవీరుడు అతిలోకసుందరి, కొండవీటి దొంగ గెటప్స్లో చిరంజీవి యానిమేషన్ పాత్ర చేసే సాహసాలు అభిమానులను అలరిస్తున్నాయి. చివర్లో వేసి 'బాస్ ఇన్ గేమ్ మెగా150' అనే టైటిల్కు సూపర్బ్ రెస్పాన్స్ వస్తోంది. జనవరి 9న మార్కెట్ లోకి విడుదలవుతున్న ఈ గేమ్ను ఎమ్-యాప్ సోర్స్ డెవలప్మెంట్ రెండు వాల్యూమ్స్గా విడుదల చేస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement