సౌత్‌కి బదాయి హో

Boney Kapoor acquires south remake rights of Badhaai Ho - Sakshi

బాలీవుడ్‌ యువనటుడు ఆయుష్మాన్‌ ఖురానా నటించిన ‘బదాయి హో’ చిత్రం గతేడాది అక్టోబర్‌లో విడుదలై మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ చిత్రానికి అమిత్‌ రవీంద్రనాథ్‌ శర్మ దర్శకత్వం వహించారు. ఈ దర్శకుడి తొలి సినిమా ‘తేవర్‌’కు బోనీకపూర్‌ నిర్మాత. ఇలా అమిత్‌శర్మను ఇండస్ట్రీకి పరిచయం చేసింది బోనీ కపూర్‌నే. ఇప్పుడు అమిత్‌ శర్మ తెరకెక్కించిన ‘బదాయి హో’ చిత్రాన్ని సౌత్‌కి చూపించాలనుకుంటున్నారు బోనీకపూర్‌.

ఈ చిత్రం దక్షిణాది రీమేక్‌ హక్కులను ఆయన  దక్కించుకున్నారు.‘‘బాలీవుడ్‌లో ఈ సినిమాకు మంచి స్పందన వచ్చింది. అదే ఆదరణ సౌత్‌లోనూ ఉంటుందని ఆశిస్తున్నాను. అయితే ఈ సినిమాను ముందుగా తెలుగులో నిర్మించాలా? లేక తమిళంలో సెట్స్‌పైకి తీసుకుని వెళ్లాలా? అనే విషయాన్ని ఇంకా నిర్ణయించుకోలేదు’’ అని పేర్కొన్నారు బోనీ కపూర్‌.  

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top