
తమిళ హీరోయిన్ మృతి
తమిళనటి హనీ శివరాజ్ అంజనా సోమవారం కన్నుమూశారు.
చెన్నై: తమిళనటి హనీ శివరాజ్ అంజనా సోమవారం కన్నుమూశారు. కొద్ది కాలంగా ఆమె క్యాన్సర్తో బాధపడుతున్నట్టు తెలుస్తోంది. దీనిపై తమిళ, మలయాలీ సినీ పరిశ్రమ విచారం వ్యక్తంచేసింది. సోషల్ మీడియాలో అంజనామృతిపై దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ కమెంట్ చేశారు. ఆమె కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
తమిళంలో కార్తీ నటించిన బిర్యానీలో సినిమాలో ముగ్గురు అమ్మాయిల్లో ఒక అమ్మాయిగా నటించిన అంజనా మృతిపై దర్శకుడు వెంకట్ ప్రభు సంతాపం వ్యక్తం చేశారు. అంజనా చాలా ప్రతిభ గల నటి అనీ.. చిన్న వయసులోనే పరిశ్రమకు దూరంకావడం దురదృష్టమన్నారు.