బిగ్‌బాస్‌: గొడవలు పెట్టడం ఎలా?

Big Boss 3 Telugu Vithika Funny Task With Housemates - Sakshi

బిగ్‌బాస్‌ తొమ్మిదో వారానికి గాను నామినేషన్‌ ప్రక్రియ ముగిసింది. ఈ వారం నామినేషన్‌లో రాహుల్‌ సిప్లిగంజ్‌, హిమజా, మహేశ్‌లు ఉన్నారు. అయితే నామినేషన్‌ ప్రక్రియ ముగిసేంత వరకు బిగ్‌బాస్‌ హౌజ్‌లో ఆసక్తికర పరిస్థితులు నెలకొంటాయి. అప్పటివరకు మిత్రులుగా ఉన్న వారు శత్రువులుగా.. శత్రువులుగా ఉన్న వారు స్నేహితులుగా మారే అవకాశాలు ఉంటాయి. అయితే నామినేషన్‌ ప్రక్రియ ముగిశాక బిగ్‌బాస్‌ ఇచ్చే ఫన్నీ, సీరియస్‌ టాస్క్‌లతో ఇంటి సభ్యులు బిజీ అవుతారు. మంగళవారం వరకు నామినేషన్‌ ప్రక్రియ జరిగింది. అనంతరం బిగ్‌బాస్‌ ఇచ్చిన ఫన్నీ టాస్క్‌ `క్రేజీ కాలేజీ'తో ఇంటి సభ్యులందరూ సరదాగా గడిపారు. 

దీనిలో భాగంగా గాసిపాలజీ లెక్చరర్‌గా వ్యవహరించిన వితికా..  బిగ్‌బాస్‌లో గొడవలు ఎలా పెట్టాలనే దానిపై ఇంటిసభ్యులతో చర్చిస్తుంది. దీనికి శ్రీముఖి, పునర్నవి, రాహుల్‌ ఇచ్చిన సమాధానాలు అందరికీ నవ్వులు తెప్పిస్తోంది. అంతకుముందు లవాలజీ లెక్చరర్‌గా బాబా భాస్కర్‌ తొలుత నవ్వులు పూయించగా.. చివరికి శివజ్యోతి చేత కంటతడి పెట్టించాడు. ఇక చిల్లాలజీ లెక్చరర్‌గా వరుణ్‌ సందేశ్‌ సందడి చేశాడు. ఇంటి సభ్యులను సిల్లీ ప్రశ్నలు అడిగి ఫన్నీ సమాధానాలు రాబట్టాడు. ఇక ఈ రోజు బిగ్‌బాస్‌ తొలుత ఉద్విగ్నంగా.. అనంతరం సందడిగా జరిగే అవకాశం ఉంది. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top