క్రేజీ మల్టీస్టారర్‌కు భారీ బడ్జెట్‌

Big Budget For Suriya 37 - Sakshi

తెలుగు, తమిళ భాషల్లో మంచి మార్కెట్‌ సొంతం చేసుకున్న స్టార్‌ హీరో సూర్య ఇప్పుడు మలయాళ ఇండస్ట్రీ మీద దృష్టి పెట్టారు. అందుకే తన తదుపరి చిత్రంలో మలయాళ సూపర్‌ స్టార్ మోహల్‌ లాల్‌ తో కలిసి నటిస్తున్నారు. సూర్య హీరోగా వీడొక్కడే, బ్రదర్స్‌ లాంటి చిత్రాలను తెరకెక్కించిన కేవీ ఆనంద్‌ ఈ క్రేజీ మల్టీ స్టారర్‌కు దర్శకత్వం వహిస్తున్నారు. సూర్య 37వ సినిమాగా తెరకెక్కుతున్న ఈసినిమాను లైకా ప్రొడక్షన్స్‌ సంస్థ నిర్మిస్తోంది.

ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాకు చిత్రయూనిట్ భారీ బడ్జెట్‌ కేటాయించినట్టుగా తెలుస్తోంది. ఎక్కువ భాగం అమెరికా, లండన్‌, బ్రెజిల్‌ లాంటి దేశాల్లో షూటింగ్ జరుపుకోనున్న ఈ సినిమాను దాదాపు 100 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో సూర్య సరసన అఖిల్‌ ఫేం సయేషా సైగల్‌ హీరోయిన్‌గా నటించనుంది.
 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top