గెస్ట్‌ ఘోస్ట్‌

Bhumika turns ghost for Samantha's remake of Kannada U Turn - Sakshi

సమంత లీడ్‌ రోల్‌లో కన్నడ సూపర్‌ హిట్‌ ‘యూ–టర్న్‌’ చిత్రాన్ని ఆ చిత్రదర్శకుడు పవన్‌ కుమార్‌ తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో సమంత జర్నలిస్ట్‌గా కనిపించనున్నారు. ఇందులో ఘోస్ట్‌ క్యారెక్టర్‌ కోసం చిత్రబృందం భూమికను సెలెక్ట్‌ చేసినట్టు సమాచారం. సెకెండ్‌ ఇన్నింగ్స్‌లో వదిన, అక్క క్యారెక్టర్స్‌ చేస్తున్న భూమిక ఇప్పుడు దెయ్యంగా కనిపించనున్నారు.

గెస్ట్‌ రోల్‌లో కొన్ని నిమిషాల ఘోస్ట్‌గా అప్పియరెన్స్‌ ఇవ్వనున్నారట భూమిక. తన క్యారెక్టర్‌ ఒక మేజర్‌ యాక్సిడెంట్‌ వల్ల చనిపోవడంతో దెయ్యంగా మారతారు. ఈ యాక్సిడెంట్‌ చుట్టూనే సినిమా కథ అంతా తిరుగుతుంది. ఈ కేస్‌ను ఇన్వెస్టిగేట్‌ చేసే పాత్రలో సమంత కనిపిస్తారు. సమంత్‌ పక్కన రాహుల్‌ రవీంద్రన్, పోలీస్‌ పాత్రలో ఆది పినిశెట్టి కనిపించనున్నారు. శ్రీనివాస సిల్వర్‌ స్క్రీన్‌ బ్యానర్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top