'భాగమతి' తమిళ రైట్స్ కు భారీ రేటు | Bhagamati movie tamil rights details | Sakshi
Sakshi News home page

'భాగమతి' తమిళ రైట్స్ కు భారీ రేటు

Nov 28 2017 1:44 PM | Updated on Nov 28 2017 1:44 PM

Bhagamati movie tamil rights details - Sakshi

అనుష్క ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న తాజా చిత్రం భాగమతి. పిల్ల జమీందార్ ఫేం అశోక్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ను యువీ క్రియేషన్స్ సంస్థ భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. జనవరి 26న రిలీజ్ కు రెడీ అవుతున్న ఈ సినిమాను తెలుగుతో పాటు తమిళ, మలయాళ భాషల్లోనూ ఒకేసారి రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

తాజాగా ఈ సినిమా తమిళ రైట్స్ ను స్టూడియో గ్రీన్ సంస్థ భారీ ధరకు తీసుకున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. కోలీవుడ్ లో స్టార్ హీరోల సరసన నటించిన అనుష్క సినిమా రైట్స్ దాదాపు 15 కోట్లు వెచ్చించి సొంతం చేసుకున్నారట. బాహుబలి సినిమాతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న అనుష్క  ఈ సినిమాతో మరోసారి సత్తా చాటుతుందని భావిస్తున్నారు. ఈ సినిమాలో ఆది పినిశెట్టి, మలయాళ నటుడు ఉన్ని ముకుందన్ లు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement