తేజ దర్శకత్వంలో సీనియర్ హీరో..?

తేజ దర్శకత్వంలో సీనియర్ హీరో..?


నేను రాజు నేనే మంత్రి సినిమాతో తిరిగి ఫాంలోకి వచ్చిన తేజ, తన నెక్ట్స్ సినిమా విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఈ సక్సెస్ ఫాంను కొనసాగించేందుకు స్టార్ ఇమేజ్ ను ఉపయోగించుకునే ప్రయత్నాల్లో ఉన్నాడు. ఇటీవల మెగా హీరోలతో తేజ ఓ మల్టీ స్టారర్ సినిమాకు ప్లాన్ చేస్తున్నాడన్న వార్తలు వినిపించాయి. అయితే ఈ ప్రాజెక్ట్ పై ఎలాంటి అధికారిక ప్రకటనా రాలేదు.తాజాగా మరో సీనియర్ హీరోతో తేజ సినిమా అన్న వార్త టాలీవుడ్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. వంద సినిమాలు పూర్తి చేసుకున్న తరువాత జెట్ స్పీడుతో సినిమాలు చేస్తున్న నందమూరి బాలకృష్ణ, తేజ దర్శకత్వంలో సినిమా చేసేందుకు అంగీకరించారట. ప్రస్తుతం కేయస్ రవికుమార్ దర్శకత్వంలో తన 102వ సినిమా చేస్తున్న బాలకృష్ణ, ఆ తరువాత చేయబోయే సినిమాను ఇంత వరకు ప్రకటించలేదు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top