బాలయ్య హీరోగా ఫాంటసీ మూవీ..!

Bala Kirshna next movie with Sv Krishna reddy - Sakshi

నందమూరి బాలకృష్ణ వంద సినిమాలు పూర్తి చేసిన తరువాత మరింత స్పీడు పెంచాడు. తన 101వ సినిమాగా పూరి జగన్నాథ్ దర్శకత‍్వంలో పైసా వసూల్ సినిమాతో ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం తమిళదర్శకుడు కేయస్ రవికుమార్ దర్శకత్వంలో ‘జై సింహా’ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా సంక్రాంతి కానుకగా రిలీజ్ అవుతోంది. ఈ సినిమా తరువాత తేజ దర్శకత్వంలో ఎన్టీఆర్ బయోపిక్ ను సెట్స్ మీదకు తీసుకెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నాడు.

తాజా బాలకృష్ణ చేయబోయే మరో సినిమాపై ఆసక్తికరమైన వార్త టాలీవుడ్ సర్కిల్స్ లో వినిపిస్తోంది. గతంలో బాలయ్య హీరోగా టాప్ హీరో సినిమాను తెరకెక్కించిన ఎస్వీ కృష్టారెడ్డి దర్శకత్వంలో బాలకృష్ణ ఓ సినిమా చేసే ఆలోచనలో ఉన్నాడట. ఈ సినిమాను ఫాంటసీ కథాంశంతో తెరకెక్కించనున్నారని తెలుస్తోంది. అధికారిక ప్రకటన లేకపోయినా.. ఇప్పటికే కథ కూడా ఓకె అయ్యిందన్న టాక్ వినిపిస్తోంది.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top