పంచెకట్టులో రాజమౌళి.. ఎందుకోసమంటే..

Baahubali Team Royal Reunion In London - Sakshi

తెలుగు సినిమా స్థాయిని ప్రపంచదేశాలకు తెలిసేలా చేసిన చిత్రం బాహుబలి. తాజాగా బాహుబలి టీమ్‌ సభ్యులు మళ్లీ కలిశారు. లండన్‌లో రాయల్‌ రీ యూనియన్‌ జరుపుకున్నారు. వీరు ఎందుకోసం కలిశారంటే.. లండన్‌లోని అల్బర్ట్‌ హాల్‌లో శనివారం ‘బాహుబలి1’ చిత్రాన్ని ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు బాహుబలి టీమ్‌ అక్కడికి వెళ్లింది. లండన్‌ వెళ్లిన వారిలో రాజమౌళి, ప్రభాస్‌, రానా, అనుష్క, కీరవాణి, శోభు యార్లగడ్డ ఉన్నారు. అక్కడ జరిగిన బాహుబలి ప్రదర్శనకు రాజమౌళి పంచెకట్టులో హాజరుకావడం విశేషం. ఈ సందర్భంగా హౌస్‌లోని ప్రేక్షకులు బాహుబలి యూనిట్‌ను చప్పట్లు, కేరింతలతో అభినందించారు. 

 

రాయల్‌ అల్బర్ట్‌ హాల్‌లో బాహుబలి ప్రదర్శనను చూడటానికి వచ్చిన పలువురు జపాన్‌ అభిమానులు వచ్చారు. బాహుబలి యూనిట్‌ స్టే చేసిన హోటల్‌ వెలుపల వారిని కలుసుకున్నారు. అలాగే వారితో ఫొటోలు కూడా దిగారు. అయితే రాయల్‌ అల్బర్ట్‌ హాల్‌లో తొలి నాన్‌-ఇంగ్లిష్‌ చిత్రం బాహుబలి అని ఆ చిత్ర బృందం తెలిపింది. ఇది మనందరికి గర్వకారణమని పేర్కొంది. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top