బాహుబలికి గిన్నిస్ రికార్డు | Baahubali Scores Another Record Courtesy Guinness | Sakshi
Sakshi News home page

బాహుబలికి గిన్నిస్ రికార్డు

Jul 22 2015 10:49 PM | Updated on Aug 21 2018 2:34 PM

బాహుబలికి గిన్నిస్ రికార్డు - Sakshi

బాహుబలికి గిన్నిస్ రికార్డు

దేశమంతటా అందరి దృష్టినీ ఆకర్షించిన ‘బాహుబలి’ చిత్రం వసూళ్ళతో పాటు ఇప్పుడు మరో విషయంలోనూ రికార్డ్ సృష్టించింది.

దేశమంతటా అందరి దృష్టినీ ఆకర్షించిన ‘బాహుబలి’ చిత్రం వసూళ్ళతో పాటు ఇప్పుడు మరో విషయంలోనూ రికార్డ్ సృష్టించింది. ప్రపంచంలోనే అతి పెద్ద పోస్టర్ రికార్డ్ కింద ‘బాహుబలి’ చిత్ర ప్రయత్నం ‘గిన్నిస్ బుక్’లోకి ఎక్కినట్లు గిన్నిస్‌బుక్ ఆఫ్ రికార్డ్స్ వారు బుధవారం ప్రకటించారు. ఆ సంగతి చిత్ర దర్శకుడు రాజమౌళి వెల్లడించారు. నిజానికి, సినిమా రిలీజ్‌కు ముందు పబ్లిసిటీ వ్యూహంలో భాగంగా కేరళలోని కొచ్చిలో జూన్ 27న ఈ చిత్రం తాలూకు అతి భారీ పోస్టర్‌ను ప్రదర్శించారు. మొత్తం 4,793.65 చదరపు మీటర్ల (51,598.21 చదరపుటడుగుల) విస్తీర్ణమున్న ఈ భారీ పోస్టర్‌ను చిత్రం మలయాళ డబ్బింగ్ వెర్షన్ పంపిణీ హక్కులు తీసుకున్న గ్లోబల్ యునెటైడ్ మీడియా కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ బృందం రూపొందించింది. రికార్డ్ కోసం చేసిన అప్పుడు చేసిన ప్రయత్నానికి ఇప్పుడు అధికారిక గుర్తింపు లభించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement