సెప్టెంబర్ 15 నుంచి 'బాహుబలి 2' షూటింగ్ | 'Baahubali 2' will resume shoot on September 15 | Sakshi
Sakshi News home page

సెప్టెంబర్ 15 నుంచి 'బాహుబలి 2' షూటింగ్

Jul 23 2015 2:29 PM | Updated on Sep 3 2017 6:02 AM

సెప్టెంబర్ 15 నుంచి 'బాహుబలి 2' షూటింగ్

సెప్టెంబర్ 15 నుంచి 'బాహుబలి 2' షూటింగ్

'బాహుబలి' రెండో భాగం షూటింగ్ సెప్టెంబర్ 15 నుంచి జరగనుందని హీరో ప్రభాస్ తెలిపారు.

చెన్నై: 'బాహుబలి' రెండో భాగం షూటింగ్ సెప్టెంబర్ 15 నుంచి జరగనుందని హీరో ప్రభాస్ తెలిపారు. తమ సెలవులన్ని ముగించుకుని సెప్టెంబర్ 15 చిత్రీకరణలో పాల్గొంటామని చెప్పాడు. రెండోభాగం షూటింగ్ 40 శాతం ఇప్పటికే పూర్తి చేశారు. ప్రధాన పాత్రల మధ్య సన్నివేశాలు చిత్రీకరణ పూర్తయిందని ప్రభాస్ తెలిపారు. యుద్ధం, ఇతర కీలక సన్నివేశాలు షూట్ చేయాల్సి ఉందని వెల్లడించాడు.

'బాహుబలి ది కన్ క్లూజన్' పేరుతో రెండో భాగం తెరకెక్కించనున్నారు. ఇందులో దగ్గుబాటి రానా, తమన్నా, అనుష్క, రమ్యకృష్ణ, నాజర్, సత్యరాజ్ ముఖ్యపాత్రలు పోషించారు. జూలై 10న విడుదలైన 'బాహుబలి' ఫస్ట్ పార్ట్ బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామీ సృష్టించింది. ఇప్పటి వరకు రూ.350 కోట్లు వసూలు చేసినట్టు ప్రచారం జరుగుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement