
మరో రికార్డు.. రూ.500కోట్లు దాటేసింది
బాహుబలి 2 మరో రికార్డును బద్ధలు కొట్టింది. విడుదలైన మూడు రోజుల్లోనే రూ.500కోట్ల మార్క్‌ను దాటేసింది.
హైదరాబాద్: బాహుబలి 2 మరో రికార్డును బద్ధలు కొట్టింది. విడుదలైన మూడు రోజుల్లోనే రూ.500కోట్ల మార్క్‌ను దాటేసింది. బాక్స్‌ఆఫీస్ ఇండియా డాట్ కామ్ ప్రకారం గడిచిన మూడు రోజుల్లో బాహుబలి 2 కలెక్షన్ల సునామీతో రూ.506కోట్లను వసూళ్లు చేసింది. ఇది ప్రివ్యూలతో కలిపితే రూ.520 కోట్లు. ఇందులో ఒక్క భారత్‌లోనే మొత్తం వసూళ్లు రూ.385కోట్లు ఉండగా.. విదేశాల్లో రూ.121 కోట్లు.
అమెరికా, కెనడా, గల్ఫ్, ఆస్ట్రేలియా దేశాల్లో ఇది వరకు ఉన్న రికార్డులు అన్ని కూడా ఈ దెబ్బతో తుడిచిపెట్టుకుపోయాయని బాక్సాఫీస్ ఇండియా పేర్కొంది. బాహుబలి ది బిగినింగ్‌కు సీక్వెల్‌గా వచ్చిన బాహుబలి కన్‌క్లూజన్ గొప్ప విజువల్ ఎఫెక్ట్స్‌తోపాటు మంచి కథాబలం తోడవడంతో దుమ్మురేచిపోయే రేంజ్‌లో దూసుకెళుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే విడుదలైన అన్ని థియేటర్లలో మరో వారం రోజులకు సరిపోయేలా టికెట్లు బుక్కయ్యాయి. దీని ప్రకారం వెయ్యి కోట్ల మార్క్‌ను దాటేందుకు మరెన్నో రోజులు ఈ చిత్రానికి పట్టకపోవచ్చు.