ఏఆర్‌ రెహమాన్‌ కచ్చేరీలు రద్దు  | AR Rahman Concert Cancelled Over Coronavirus | Sakshi
Sakshi News home page

ఏఆర్‌ రెహమాన్‌ కచ్చేరీలు రద్దు 

Published Sun, Mar 29 2020 8:07 AM | Last Updated on Sun, Mar 29 2020 8:17 AM

AR Rahman Concert Cancelled Over Coronavirus - Sakshi

ఏఆర్‌ రెహమాన్‌ సంగీత కచ్చేరీలు రద్దయ్యాయి. ఆయన ఎక్కువగా విదేశాల్లోనే సంగీత కచ్చేరీలు నిర్వహిస్తున్నారు. మే, జూన్‌ నెలల్లో ఉత్తర అమెరికాలో సంగీత విభావరి నిర్వహించడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ప్రస్తుత కరోనా ఎఫెక్ట్‌ ఆయన సంగీత కచ్చేరీలపైనా పడింది. అమెరికాలో సంగీత కచ్చేరీలు నిర్వహించడం తనకూ, తన సంగీత బృందానికి శ్రేయస్కరం కాదని భావించిన ఏఆర్‌ రెహమాన్‌ వాటిని రద్దు చేసుకున్నారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు.  (‘జుమాంజి’ నటికి కరోనా)

నటుడు యోగిబాబు వివాహ రిసెప్షన్‌ వాయిదా
అలాగే నటుడు యోగిబాబు వివాహ రిసెప్షన్‌ వాయిదా పడింది. ఆయన మంజుభార్గవి అనే వైద్యురాలిని గత ఫిబ్రవరి 5వ తేదీన పెళ్లి చేసుకున్నారు. ఏప్రిల్‌ 5న వివాహ రెసెప్షన్‌ ఉంటుందని ప్రకటించారు. కానీ కరోనా నేపథ్యంలో దీన్ని రద్దు చేస్తున్నట్టు వెల్లడించారు. (లిక్కర్‌ షాపులు తెరవండి : నటుడి విజ్ఞప్తి)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement
Advertisement