చేతిలో చెయ్యేసి చెప్పు కోహ్లి! | Anushka Sharma opens up about her relationship with Virat Kohli | Sakshi
Sakshi News home page

చేతిలో చెయ్యేసి చెప్పు కోహ్లి!

May 24 2017 11:41 PM | Updated on Sep 5 2017 11:54 AM

చేతిలో చెయ్యేసి చెప్పు కోహ్లి!

చేతిలో చెయ్యేసి చెప్పు కోహ్లి!

అనుష్కా శర్మ, విరాట్‌ కోహ్లి లవ్‌స్టోరీ మాంచి ఫ్లోలో ఉంది. రెస్టారెంట్లలో, కాఫీ షాపుల్లో చక్కర్లు కొడుతోంది రూమర్లు కాదు... స్వయానా విరాట్, అనుష్కలే.

అనుష్కా శర్మ, విరాట్‌ కోహ్లి లవ్‌స్టోరీ మాంచి ఫ్లోలో ఉంది. రెస్టారెంట్లలో, కాఫీ షాపుల్లో చక్కర్లు కొడుతోంది రూమర్లు కాదు... స్వయానా విరాట్, అనుష్కలే. మొన్నీ మధ్య క్రికెటర్‌ జహీర్‌ఖాన్, యాక్టర్‌ సాగరిక ఎంగేజ్మెంట్‌ పార్టీకి ఇద్దరూ చేతిలో చెయ్యేసుకుని వచ్చారట. ఇంకేముంది ఫ్యాన్లు రెచ్చిపోతున్నారు. నార్త్‌ ఫ్యాన్స్‌ సంగతెలా ఉన్నా సౌత్‌ స్టార్లు ఇలాంటి ప్రేమ వ్యవహారాల్లో లేరని మనవాళ్లు బాగా డిజప్పాయింట్‌ అవుతున్నారు.

బాలీవుడ్‌ వాళ్లు జాలీగా ఉంటే మనవాళ్లను చూసి జాలి వేస్తుందంటున్నారు. మన యంగ్‌ హీరోస్‌ కూడా అప్పుడప్పుడు ఇలాంటి చమ్మక్కులు చేస్తే చూసి తరిస్తాము... బాలీవుడ్‌కి మన తడాఖా చూపిస్తామంటున్నారు తెలుగు ఫ్యాన్లు. అందుకే ఏదో ఒకటి చెయ్యండిరా అమ్మాయిలూ... అబ్బాయిలూ! అన్నట్లు.. ముంబయ్‌లో బుధవారం జరి గిన ‘సచిన్‌’ ప్రీమియర్‌ షోకు కూడా విరాట్, అనుష్క జంటగా హాజరయ్యారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement