నాగ్‌ సినిమాలో చైతూ హీరోయిన్‌..!

Anu Emmanuel Play An Important Role In Nagarjuna Dhanush Film - Sakshi

కింగ్‌ నాగార్జున డిఫరెంట్‌ రోల్స్‌కు, మల్టీస్టారర్‌ సినిమాలకు సై అంటున్నారు. తాజాగా నానితో కలిసి దేవదాస్‌ సినిమాలోనటిస్తున్న నాగ్‌, త్వరలో ఓ తమిళ మల్టీస్టారర్‌లో నటించేందుకు ఓకె చెప్పారు. పవర్‌పాండి సినిమాతో కోలీవుడ్‌లో దర్శకుడిగా సక్సెస్‌ సాధించిన ధనుష్‌ త్వరలో ఓ మల్టీస్టారర్‌ సినిమాలో నటిస్తూ దర్శకత్వం వహించనున్నారు. ఈ సినిమాలో మరో హీరోగా టాలీవుడ్ మన్మథుడు నాగార్జున నటిస్తున్నారు.

ప్రముఖ నిర్మాణ సంస్థ తేనాండళ్‌ ఫిలింస్‌ నిర్మిస్తున్న ఈ సినిమాలో ఒక హీరోయిన్‌ గా అదితిరావ్‌ హైదరీని ఫైనల్‌ చేయగా మరో హీరోయిన్‌ పాత్రకు అను ఇమ్మాన్యూల్‌ను తీసుకున్నట్టుగా తెలుస్తోంది. తాజాగా నాగచైతన్య సరసన శైలజా రెడ్డి అల్లుడు సినిమాలో నటించిన అను, వెంటనే నాగ్ సినిమాలో ఛాన్స్‌ కొట్టేశారు. శరత్‌ కుమార్‌, ఎస్‌జే సూర్యలు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకు పవర్‌ పాండి ఫేం సీన్‌ రోనాల్డ్‌ సంగీతమందిస్తున్నారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top