సింహంలా షమితాబ్ | Amitabh Bachchan shares Shamitabh look, says difficult to preserve | Sakshi
Sakshi News home page

సింహంలా షమితాబ్

Jul 21 2014 11:00 PM | Updated on Sep 2 2017 10:39 AM

సింహంలా షమితాబ్

సింహంలా షమితాబ్

పాత్రల ఎంపికలో బిగ్ బీ అమితాబ్ బచ్చన్‌ది ఓ విభిన్నమైన శైలి. ఐదు దశాబ్దాల సుదీర్ఘ నటప్రస్థానంలో మరపురాని పాత్రలతో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న మహానటుడాయన.

పాత్రల ఎంపికలో బిగ్ బీ అమితాబ్ బచ్చన్‌ది ఓ విభిన్నమైన శైలి. ఐదు దశాబ్దాల సుదీర్ఘ నటప్రస్థానంలో మరపురాని పాత్రలతో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న మహానటుడాయన. ఆయన పోషించిన ఒక్కో పాత్రా నేటి తరానికి ఒక్కో పాఠ్యాంశం అంటే అతిశయోక్తి ఏమాత్రం కాదు. 71 ఏళ్ల వయసులో కూడా 17 ఏళ్ల కుర్రాడిలాగా కుర్రహీరోలతో పోటీపడుతున్నారాయన. తాజాగా అమితాబ్ ’షమితాబ్’ అనే చిత్రంలో నటిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ని విడుదల చేశారు. నెరిసిన జుత్తు, పెరిగిన గడ్డం, తీక్షణమైన చూపు... ఓవరాల్‌గా ఓ సింహాన్ని చూస్తున్న అనుభూతికి గురి చేస్తున్నారు ఈ ఫస్ట్‌లుక్‌లో అమితాబ్.
 
 ప్రపంచవ్యాప్తంగా ఉన్న బిగ్‌బీ అభిమానులు పండుగ చేసుకునేలా ‘షమితాబ్’ ఫస్ట్‌లుక్ ఉంది. దీన్ని బట్టి... ఇందులో అమితాబ్ పాత్ర ఎలా ఉంటుందో ఓ అంచనా కొచ్చేస్తున్నారు ప్రేక్షకులు. మరో విషయం ఏంటంటే... ఈ ఫస్ట్‌లుక్ అమితాబ్‌కి కూడా విపరీతంగా నచ్చేసింది. అందుకే... ‘షమితాబ్’ చిత్రానికి సంబంధించిన స్టిల్స్‌ని గోప్యంగా ఉంచడానికి నా మనసు ఒప్పుకోవడం లేదు’అని తన సోషల్ మీడియా వైబ్‌సైట్‌లో ఓ సందేశాన్ని పోస్ట్ చేశారు బిగ్‌బీ. కమల్‌హాసన్ కుమార్తె అక్షర హాసన్, రజనీకాంత్ అల్లుడు ధనుష్ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి ‘ఇంగ్లిష్ వింగ్లిష్’ ఫేం ఆర్.బాల్కీ దర్శకుడు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement