ఆగస్టు 5న శ్రీరస్తు శుభమస్తు | allu sirish srirastu subhamastu gets a release date | Sakshi
Sakshi News home page

ఆగస్టు 5న శ్రీరస్తు శుభమస్తు

Jul 16 2016 8:19 PM | Updated on Sep 4 2017 5:01 AM

ఆగస్టు 5న శ్రీరస్తు శుభమస్తు

ఆగస్టు 5న శ్రీరస్తు శుభమస్తు

గౌరవం సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన యంగ్ హీరో అల్లు శిరీష్. తొలి సినిమాతో నిరాశపరిచిన ఈ యంగ్ హీరో రెండో ప్రయత్నంగా చేసిన కొత్త జంట సినిమాతో పరవాలేదనిపించాడు. అయితే కమర్షియల్ హీరోగా...

గౌరవం సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన యంగ్ హీరో అల్లు శిరీష్. తొలి సినిమాతో నిరాశపరిచిన ఈ యంగ్ హీరో రెండో ప్రయత్నంగా చేసిన కొత్త జంట సినిమాతో పరవాలేదనిపించాడు. అయితే కమర్షియల్ హీరోగా నిలదొక్కుకునే స్టామినాను మాత్రం చూపించలేకపోయాడు. దీంతో కొంత గ్యాప్ తీసుకున్న శిరీష్ ఇప్పుడు మరో సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. ప్రజెంట్ టాలీవుడ్లో ఫ్యామిలీ డ్రామాలకు మంచి ఆదరణ లభిస్తుండటంతో అదే జానర్ లో లవ్ ఎంటర్టైనర్తో ఆడియన్స్ ముందుకు వస్తున్నాడు.

తన సొంతం నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ బ్యానర్లో అల్లు అరవింద్ నిర్మాతగా తెరకెక్కుతున్న శ్రీరస్తు శుభమస్తు సినిమాలో నటిస్తున్నాడు శిరీష్. పూర్తి మేకోవర్తో న్యూ లుక్తో కనిపిస్తున్న శిరీష్ సరసన లావణ్య త్రిపాఠి హీరోయిన్గా నటిస్తోంది. సోలో లాంటి ఫ్యామిలీ డ్రామాలను అందించిన పరుశురామ్ ఈ సినిమాకు దర్శకుడు. ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ టీజర్లకు మంచి స్పందన రావటంతో సినిమాకు కూడా హైప్ క్రియేట్ అయ్యింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న ఈ సినిమాను ఆగస్ట్ 5న రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement