‘కాంచన 2’ రీమేక్‌లో బాలీవుడ్‌ స్టార్‌ హీరో

Kanchana 2 Poster - Sakshi

సౌత్‌లో హర్రర్‌ సినిమాలకు క్రేజ్‌ తీసుకువచ్చిన నటుడు రాఘవ లారెన్స్‌. ముని, కాంచన, గంగ (కాంచన 2) సినిమాలతో వరస విజయాలు సాధించిన లారెన్స్‌.. ప్రస్తుతం కాంచన 3 షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. లారెన్స్‌ సరసన తాప్సీ, నిత్యామీనన్‌లు హీరోయిన్లుగా నటించిన ‘గంగ(కాంచన 2)’ సినిమా తెలుగు, తమిళ భాషల్లో ఘనవిజయం సాధించింది. ఇప్పుడు ఈ సినిమాను బాలీవుడ్‌లో రీమేక్‌ చేస్తున్నారు. ఈ రీమేక్‌ లో లారెన్స్‌ పాత్రలో బాలీవుడ్ స్టార్‌ హీరో అక్షయ్‌ కుమార్ నటించనున్నాడు.

క్రిఅర్జ్‌ ఎంటర్‌టైన్మెంట్స్‌ బ్యానర్‌పై ప్రేరణా అరోరా, అర్జున్‌ ఎన్‌ కపూర్‌లు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ప్యాడ్ మ్యాన్‌ రిలీజ్‌ కోసం ఎదురుచూస్తున్న అక్షయ్‌, 2.ఓ, కేసరి, గోల్డ్‌ సినిమాల షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాలు పూర్తయిన తరువాత గంగ(కాంచన 2) రీమేక్‌ సెట్స్ మీదకు వెళ్లనుంది. ఈ సినిమాను 2019లో రిలీజ్‌ చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నారు. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top