మనసు చదివేస్తాడు | ajay special released on november last week | Sakshi
Sakshi News home page

మనసు చదివేస్తాడు

Oct 29 2018 1:07 AM | Updated on Oct 29 2018 1:07 AM

ajay special  released on november last week - Sakshi

అజయ్‌

‘విక్రమార్కుడు’ సినిమాలో ప్రతినాయకుడిగా అందరి ప్రశంసలు అందుకున్నారు అజయ్‌. పలు చిత్రాల్లో హీరోగా, విలన్‌గా, సహాయ నటుడిగా నటిస్తున్న ఆయన ప్రధాన పాత్రలో తెరకెక్కిన తాజా చిత్రం ‘స్పెషల్‌’. వాస్తవ్‌ దర్శకత్వంలో నందలాల్‌ క్రియేషన్స్‌ పతాకంపై నందమ్‌ శ్రీవాస్తవ్‌ నిర్మించారు. వాస్తవ్‌ మాట్లాడుతూ– ‘‘ఇదొక మైండ్‌ రీడర్‌ స్టోరీ. ఓ వ్యక్తిని ఒక అమ్మాయి లవ్‌ చేసి వదిలేస్తుంది. ఆ అమ్మాయి అతన్ని మోసం చేయడానికి కారణమైన వాళ్ల మీద ఈ మైండ్‌ రీడర్‌ పగ తీర్చుకుంటాడు. మనుషుల్ని టచ్‌ చేసి, వాళ్ల మైండ్‌ రీడ్‌ చేసే ఒక పారాసైకాలజీ స్కిల్‌ నేపథ్యంలో ఈ సినిమా సాగుతుంది.

హాలీవుడ్‌ తరహా కథాంశంతో తీసిన ఔట్‌ అండ్‌ ఔట్‌ ఎంటర్‌టైనర్‌ ఇది. అజయ్‌ పోలీస్‌ ఆఫీసర్‌గా నటించారు’’ అన్నారు. ‘‘ఫ్యాంటసీ లవ్‌ యాక్షన్‌ షేడ్స్‌తో నడిచే చిత్రమిది. కథ, కథనం, ట్విస్టులు ఈ చిత్రానికి ప్రధాన బలం. ఇందులోని డైలాగ్స్‌ ప్రేక్షకులకు కొత్త ఫీలింగ్‌ని ఇస్తాయి. ఈనెల 29న టీజర్‌ను, నవంబర్‌ చివరి వారంలో సినిమాని రిలీజ్‌ చేస్తాం’’ అని శ్రీవాస్తవ్‌ అన్నారు. రంగ, అక్షత, సంతోష, అశోక్‌ కుమార్‌ తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: ఎన్వీఎస్‌ మన్యం, కెమెరా: బి అమర్‌ కుమార్‌.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement