అన్నీ తానై!

Aishwarya Rai Bachchan's Look From Fanne Khan Is Out And You Better Not Miss It! - Sakshi

బాలీవుడ్‌ స్పైస్‌

ప్రతిభకు కష్టం తోడైతే గెలుపు మార్గం కనిపిస్తుంది. ఆ గెలుపు మార్గంలో వెళ్తున్న ఓ యంగ్‌ టాలెంటెడ్‌ టీనేజ్‌ సింగర్‌ని కొందరు మాటలతో ఓడించాలని ట్రై చేశారు. ఫైనల్లీ ఆ అమ్మాయే గెలిచింది. కానీ ఈ గెలుపులో ఐశ్యర్యారాయ్‌ ఆ అమ్మాయికి అన్నీ తానై అండగా నిలబడి, అభయమిచ్చారు. హిందీ చిత్రం ‘ఫ్యాన్నీఖాన్‌’ కథ ఇలానే ఉండబోతుందని బీటౌన్‌ టాక్‌. ఐశ్యర్యారాయ్, అనిల్‌ కపూర్, రాజ్‌కుమార్‌ రావ్, దివ్య ముఖ్యతారలుగా నటిస్తోన్న చిత్రం ‘ఫ్యాన్నీఖాన్‌’.

ఈ సినిమాలో సింగర్‌ పాత్రలో ఐశ్యర్యారాయ్‌ బచ్చన్‌ కనిపించనున్నారు. ట్యాక్సీ డ్రైవర్‌గా అనిల్‌కపూర్‌ కనిపించనున్నారట. సినిమాలో అనిల్‌ కపూర్‌కి ఓ కూతురు ఉంటుంది. తను టాలెంటెడ్‌ సింగర్‌. సీనియర్‌ సింగర్‌ అయిన ఐశ్యర్య ఆ అమ్మాయికి హెల్ప్‌ చేస్తారట. అదెలా అనేది స్క్రీన్‌పై చూడాల్సిందే. ఈ సినిమాలో ఐశ్యర్య లుక్‌ను రిలీజ్‌ చేశారు. ఈ ఏడాది రంజాన్‌కు ‘ఫ్యాన్నీఖాన్‌’ను రిలీజ్‌ చేయాలనుకుంటున్నారు. ఆల్రెడీ సల్మాన్‌ ‘రేస్‌ 3’తో రంజాన్‌కు రెడీగా ఉన్నారు. మరి.. సల్మాన్‌ వర్సెస్‌ ఐశ్యర్యలో ఎవరు వెనక్కి తగ్గుతారన్న చర్చ బాలీవుడ్‌లో జరుగుతోంది.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top