హ్యాపీ బర్త్‌డే బేబీ: ఐశ్వర్యరాయ్‌

Abhishek Bachchan Birthday Celebration With Family - Sakshi

బాలీవుడ్‌ స్టార్‌ అభిషేక్‌ బచ్చన్‌ నేడు 44వ వడిలోకి అడుగుపెట్టాడు. తల్లిదండ్రులు బిగ్‌బీ అమితాబ్‌ బచ్చన్‌, జయా బచ్చన్‌, భార్య ఐశ్వర్యరాయ్‌, కూతురు ఆరాధ్యల సమక్షంలో అభిషేక్‌ తన పుట్టినరోజును ఘనంగా జరుపుకున్నాడు. ఇక అభిషేక్‌కు ఇష్టమైన వాటి నమూనాతో ప్రత్యేక కేక్‌ను తయారు చేయించింది అందాల సుందరి ఐశ్వర్య. ‘హ్యాపీ బర్త్‌డే బేబీ.. ప్రేమతో’ అంటూ నవ్వులు చిందిస్తున్న ఫ్యామిలీ ఫొటోను సోషల్‌ మీడియాలో పంచుకుంది.  అతని సోదరి శ్వేతా బచ్చన్‌ గత స్మృతులను గుర్తు చేసుకుంటూ వాళ్లిద్దరూ కలిసి చిన్నప్పుడు సైకిల్‌తో ఆడుకున్న ఫొటోలను పంచుకుంటూ బర్త్‌డే గ్రీటింగ్స్‌ తెలిపింది. ఇది అభిమానులను ఎంతగానో అలరిస్తోంది. (అమితాబ్‌కు బిగ్‌ ఫ్యాన్‌ని)

ఇ​క అమితాబ్‌ బచ్చన్‌ పుట్టినరోజును పురస్కరించుకుని భావోద్వేగ పోస్ట్‌ పెట్టాడు. ‘ఆరోజు ఫిబ్రవరి 5. బ్రీచ్‌ క్యాండీ ఆసుపత్రిలో ఆ రోజంతా వాడి రాకకోసం ఎంతో ఆదుర్దాగా ఎదురు చూశాను. ఎట్టకేలకు వాడు జన్మించాడు. అభిషేక్‌ ఈ లోకంలోకి అడుగుపెట్టడంతో అందరం ఆనందంలో తేలియాడుతూ సంబరాలు జరుపుకున్నాం’ అని ఎమోషనల్‌ అయ్యాడు. పిల్లలు ఎంత ఎదిగినా కన్నవాళ్ల కంటికి ఇంకా చిన్నపిల్లల్లాగే కనబడుతారనేది అమితాబ్‌ విషయంలో మరోసారి నిరూపితమైంది. ‘నేటితో అతనికి 44 సంవత్సరాలు. కానీ నా కంటికి ఇంకా చిన్నపిల్లోడే. చిన్ననాటి అమాయకత్వం అభిషేక్‌కు ఇప్పటికీ పోలేదు. బహుశా పోదేమో కూడా’ అని రాసుకొచ్చాడు. చదవండి: ముద్దు మురిపాలు

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top