టైటిలే చెబుతోంది ఆడేంటో! | Aadu magadura bujji almost ready for release | Sakshi
Sakshi News home page

టైటిలే చెబుతోంది ఆడేంటో!

Oct 23 2013 1:35 AM | Updated on Sep 1 2017 11:52 PM

టైటిలే చెబుతోంది ఆడేంటో!

టైటిలే చెబుతోంది ఆడేంటో!

ప్రేమకథా చిత్రమ్’ విజయం తర్వాత సుధీర్‌బాబు చేస్తున్న చిత్రం ‘ఆడు మగాడ్రా బుజ్జి’. కృష్ణారెడ్డి గంగదాసు దర్శకుడు. ఎస్.ఎన్.ఆర్.ఫిలిమ్స్ ఇండియా, కలర్స్

‘ప్రేమకథా చిత్రమ్’ విజయం తర్వాత సుధీర్‌బాబు చేస్తున్న చిత్రం ‘ఆడు మగాడ్రా బుజ్జి’. కృష్ణారెడ్డి గంగదాసు దర్శకుడు. ఎస్.ఎన్.ఆర్.ఫిలిమ్స్ ఇండియా, కలర్స్ అండ్ క్లాప్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్త నిర్మాణంలో సుబ్బారెడ్డి, ఎస్.ఎన్.రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దర్శకుడు మాట్లాడుతూ ‘‘టైటిల్ బట్టే ఈ సినిమా ఎంత శక్తివంతంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. హీరోగా సుధీర్‌బాబు రేంజ్‌ని పెంచే సినిమా ఇది’’ అని చెప్పారు. నిర్మాతలు మాట్లాడుతూ -‘‘ఆద్యంతం నవ్వించే యాక్షన్ ఎంటర్‌టైనర్ ఇది. ఒక్క పాట మినహా చిత్రీకరణ పూర్తయింది. నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ నెలలో పాటలను, వచ్చే నెలలో చిత్రాన్ని విడుదల చేస్తాం’’ అని తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: శాంటోనియో ట్రెజియో, సహనిర్మాత: సుభాష్‌చంద్ర ఆకుల.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement