నాలుగు భాషల్లో సినిమా చేయడం ఓ రికార్డ్ : దర్శకుడు చంద్రమహేశ్ | A recording of the film in four languages | Sakshi
Sakshi News home page

నాలుగు భాషల్లో సినిమా చేయడం ఓ రికార్డ్ : దర్శకుడు చంద్రమహేశ్

Sep 4 2015 11:32 PM | Updated on Sep 3 2017 8:44 AM

నాలుగు భాషల్లో సినిమా చేయడం ఓ రికార్డ్ : దర్శకుడు చంద్రమహేశ్

నాలుగు భాషల్లో సినిమా చేయడం ఓ రికార్డ్ : దర్శకుడు చంద్రమహేశ్

ఈ చిత్రకథానాయకుడు మహదేవ్ నాన్నగారు శ్రీరామ్‌రెడ్డిగారు... మా నాన్నగారికి మంచి స్నేహితుడు. చంద్రమహేశ్ మా సంస్థకు సన్నిహితుడు.

 ‘‘ఈ చిత్రకథానాయకుడు మహదేవ్ నాన్నగారు శ్రీరామ్‌రెడ్డిగారు... మా నాన్నగారికి మంచి స్నేహితుడు. చంద్రమహేశ్ మా సంస్థకు సన్నిహితుడు. ఈ సినిమా మంచి విజయం సాధించి అందరికీ  మంచి పేరు రావాలని కోరుకుంటున్నా’’ అని హీరో రానా అన్నారు. మహదేవ్, అంజనా మీనన్ జంటగా సినీ నిలయ క్రియేషన్స్ పతాకంపై తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో చంద్రమహేశ్ దర్శకత్వంలో పీవీ శ్రీరామ్‌రెడ్డి నిర్మించిన చిత్రం ‘రెడ్ ఎలర్ట్’. రవివర్మ సంగీతం అందించిన ఈ చిత్రం పాటల వేడుక ఇటీవల హైదరాబాద్‌లో జరిగింది. ఈ చిత్రం ఆడియో సీడీని రానా ఆవిష్కరించారు.
 
 చంద్రమేహ శ్ మాట్లాడుతూ- ‘‘ఏకకాలంలో నాలుగు భాషల్లో సినిమా చేయడం ఓ రికార్డ్. అందుకే ‘ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్’వారు  మా రికార్డ్‌ను గుర్తించారు. కన్నడ, మలయాళ భాషల్లో ఇటీవలే విడుదలై, మంచి విజయం సాధించింది.  తెలుగు, తమిళ భాషల్లో త్వరలో విడుదల చేయనున్నాం’ అని తెలిపారు. ‘‘మా నాన్నగారు మన మధ్య ఉండి ఉంటే బాగుండేది. ఆయన ఎక్కడున్నా మమ్మల్ని ఆశీర్వదిస్తారని నమ్ముతున్నా. చంద్రమహేశ్‌గారు కష్టపడి సినిమా తీశారు. మంచి విజయం సాధిస్తుందని నమ్ముతున్నాను’’ అని హీరో మహదేవ్ చెప్పారు. ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి,  తెలంగాణ రాష్ట్ర శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్, చిత్రసమర్పకుడు త్రిలోక్ రెడ్డి, ఎగ్జిక్యూటివ్ నిర్మాత జైపాల్‌రెడ్డి, అంజనా మీనన్ తదితరులు మాట్లాడారు.
 

Advertisement

పోల్

Advertisement