స్పీడు స్పీడులే... ఇది సూపర్‌ స్పీడులే! | 2.0: Resul Pookutty in awe of Thalaivar Rajinikanth's commitment | Sakshi
Sakshi News home page

స్పీడు స్పీడులే... ఇది సూపర్‌ స్పీడులే!

Dec 28 2016 12:11 AM | Updated on Sep 4 2017 11:44 PM

స్పీడు స్పీడులే... ఇది సూపర్‌ స్పీడులే!

స్పీడు స్పీడులే... ఇది సూపర్‌ స్పీడులే!

‘నరసింహ’ సినిమా క్లైమాక్స్‌లో రజనీకాంత్‌ ఫైట్‌ చేస్తుంటే కారులో కూర్చున్న నటుడు అబ్బాస్‌ ‘ఆహా.. మీకింకా వయసు అవ్వలేదు’ అనే డైలాగ్‌ చెబుతాడు.

‘నరసింహ’ సినిమా క్లైమాక్స్‌లో రజనీకాంత్‌ ఫైట్‌ చేస్తుంటే కారులో కూర్చున్న నటుడు అబ్బాస్‌ ‘ఆహా.. మీకింకా వయసు అవ్వలేదు’ అనే డైలాగ్‌ చెబుతాడు. ‘నరసింహ’లోని ఒక్క ఫైట్‌ మాత్రమే కాదు.. సినిమాల్లోనూ, నిజ జీవితంలోనూ రజనీ స్పీడ్‌ చూసి అభిమానులు ప్రశంసించకుండా ఉండలేరు. ఇప్పుడీ సూపర్‌స్టార్‌ స్పీడ్‌ చూసి ప్రముఖ సౌండ్‌ డిజైనర్‌ రసూల్‌ పూకుట్టి ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. రజనీకాంత్‌ హీరోగా శంకర్‌ దర్శకత్వంలో రూపొందుతున్న సైన్స్‌ ఫిక్షన్‌ సినిమా ‘2.0’కి ఈయనే సౌండ్‌ డిజైనర్‌గా పని చేస్తున్నారు. సోమవారం నుంచి రజనీకాంత్‌ తన పాత్రకు డబ్బింగ్‌ చెప్పడం ప్రారంభించారు. ఒక్క రోజులో మూడు రీళ్లకు డబ్బింగ్‌ చెప్పేశారని రసూల్‌ పూకుట్టి ట్వీట్‌ చేశారు. ‘‘వృత్తి పట్ల తలైవా (రజనీకాంత్‌) అంకితభావం, నిబద్ధత అసమానం.

ఆయనకు ఆయనే సాటి. ఒక్క రోజులో మూడు రీళ్లకు డబ్బింగ్‌ చెప్పారు. ఆయన వర్క్‌ చూసి నేను ఆశ్చర్యపోయా’’ అని రసూల్‌ అన్నారు. రసూల్‌ మాటలు వింటుంటే, ‘బాషా’లో సూపర్‌ స్టార్‌ సై్టల్‌ను ఉద్దేశించి రాసిన ‘సై్టలు సై్టలులే.. ఇది సూపర్‌ సై్టలులే...’ పాటను ఆయన స్పీడుకి ఆపాదించి, ‘స్పీడు స్పీడులే.. ఇది సూపర్‌ స్పీడులే’ అని కూడా అనొచ్చేమో అనిపిస్తోంది. అమీ జాక్సన్‌ హీరోయిన్‌గా, హిందీ హీరో అక్షయ్‌ కుమార్‌ విలన్‌గా నటిస్తున్న ఈ సిని మాకు రెహమాన్‌ సంగీత దర్శకుడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement