విద్యుత్‌ తీగలు తెగిపడి రైళ్ల రాకపోకలకు అంతరాయం

సాక్షి, మహబూబాబాద్‌: విద్యుత్‌ తీగలు తెగిపడడంతో మహబూబాబాద్‌ మీదుగా సాగే పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కె.సముద్రం మండలం ఇంటికన్నె రైల్వేస్టేషన్ దగ్గర ఆదివారం తెల్లవారుజామున విద్యుత్ తీగలు తెగిపడ్డాయి. దీంతో రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది.

వెంటనే స్పందించిన రైల్వే అధికారులు సమస్యను పరిష్కరించారు. ఈ సంఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం వాటిల్లలేదు. విద్యుత్‌ వైర్లు తొలగించిన అనంతరం రైళ్ల రాకపోకలను పునరుద్ధరించారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top