ఉత్సాహంగా పీపీఎల్‌ టోర్నీ

ppl cricket tournament runnig succesfully - Sakshi

బోల్తా పడిన రవి స్వీట్స్‌ జట్టు 75 పరుగులకే ఆలౌట్‌  

దూసుకెళ్లిన చాయిస్‌ స్పోర్ట్స్‌

అభిమానులతో కోలాహలంగా సర్దార్‌ పటేల్‌ స్టేడియం  

ఖమ్మం స్పోర్ట్స్‌: పువ్వాడ ప్రీమియర్‌ లీగ్‌ టీ–20 క్రికెట్‌ పోటీలు సర్దార్‌ పటేల్‌ స్టేడియంలో  ఉత్సాహభరితంగా సాగుతున్నాయి. జిల్లా స్థాయి పోటీల్లో ఖమ్మంకు చెందిన క్రికెటర్లు అధికంగా పాల్గొనడంతో మ్యాచ్‌లను తిలకించేందుకు అభిమానులు భారీగా తరలివస్తున్నారు. తమకు నచ్చిన బ్యాట్స్‌మెన్, బౌలర్లు సిక్స్‌లు, ఫోర్లు కొట్టినప్పుడు, ఫీల్డర్లు క్యాచ్‌లు పట్టినప్పుడు కేరింతలు కొడుతూ క్రీడాస్ఫూర్తిని నింపుతున్నారు. ఖమ్మంలో మొదటిసారిగా ప్లడ్‌లైట్ల వెలుగులో మ్యాచ్‌లు జరుగుతుండడంతో అభిమానులు అధిక సంఖ్యలో తరలివచ్చి తిలకిస్తున్నారు. శుక్రవారం జరిగిన  తొలిమ్యాచ్‌లో చాయిస్‌ స్పోర్ట్స్‌–రవిస్వీట్స్‌ జట్లు తలపడగా టాస్‌ గెలచిన రవిస్వీట్స్‌ బ్యాటింగ్‌ను ఎంచుకుంది. కేవలం 10.3 ఓవర్లు ఆడి 75 పరుగులకే ఆలౌటయింది. తాతాబాబు, 9 బంతు లు ఆడి మూడు సిక్సర్లు, ఒక ఫోరుతో 26 పరుగులు చేయగా మిగిలిన బ్యాట్స్‌మెన్‌లు ఎవరూ రాణించలేకపోయారు.

చాయిస్‌ స్పోర్ట్స్‌ బౌలర్లలో జిత్తు 1.3 ఓవర్లలో 5 పరుగులకు 4 వికెట్లు తీయగా,  వంశీ 2, యాసిన్‌ 2, లలిత్‌ 1 వికెట్‌ తీసుకున్నారు. స్వల్ప స్కోరును సాధించేందుకు బరిలోకి దిగిన చాయిస్‌ స్పోర్ట్స్‌ 8.4 ఓవర్లలోనే  రెండు వికెట్ల నష్టానికి లక్ష్యాన్ని అధిగమించింది.  బ్యాట్స్‌మెన్‌లు యాసిన్‌ మూడు ఫోర్లు, ఒక సిక్సర్‌తో 23, కిషోర్‌ 3 ఫోర్లు, 1 సిక్సర్‌తో 23, షేక్‌ మహ్మద్‌ 18 పరుగులు చేశారు. రవిస్వీట్స్‌ బౌలర్లు కిరణ్, తాతాబాబులు ఒక్కో వికెట్‌ తీసుకున్నారు. గురువారం రాత్రి జరిగిన లీగ్‌ మ్యాచ్‌లో అరవిందా కాటన్స్‌– వీవీసీ మోటర్స్‌ జట్లు తలపడగా  అరవిందా కాటన్స్‌ పరిమిత 20 ఓవర్లు ఆడి పది వికెట్లు కోల్పోయి 111 పరుగులు చేసింది. జట్టులో రాకేష్‌ మూడు బౌండరీలతో 31 పరుగులు చేయగా, అఖిల్, ప్రసన్నలు 10 పరుగుల  చేశారు. వీవీసీ మోటర్స్‌ బౌలర్లలో శ్రావణ్‌కుమార్‌ 3, రాజేంద్ర 2, జ్యోతిసాయి 2, రాజ్‌కుమార్‌ 2, నిషాంత్‌ ఒక వికెట్‌ తీసుకున్నారు. అనంతరం బ్యాటింగ్‌ చేపట్టిన వీవీసీ మోటర్స్‌ 15.1 ఓవర్లలో 114 పరుగులు చేసి విజయం సాధించింది.  బ్యాట్స్‌మెన్‌లు శశికాంత్‌ 31, శ్రావణ్‌కుమార్‌ 24, రాజేందర్‌ 16 పరుగులు చేశారు. దీంతో వీవీసీ మోటర్స్‌ జట్టు విజయం సాధించిం

Read latest Khammam News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top