మాల్‌లో మహిళ వికృత చర్య.. ఫైరవుతోన్న నెటిజన్లు

Woman Peeing on Potatoes Caught on Video - Sakshi

వాషింగ్టన్‌: ఇప్పటి వరకు విమానాల్లో, షాపింగ్‌ మాల్స్‌లో వికృత చర్యలకు పాల్పడిన మగ వారి గురించే చదివాం. కానీ తాజాగా ఓ యువతి వీరందరిని తలదన్నే వికృతమైన చర్యకు పాల్పడింది. వాల్‌మార్ట్‌ మాల్‌కు వెళ్లిన ఓ యువతి.. అక్కడే ఉన్న ఆలుగడ్డలపై మూత్ర విసర్జన చేసింది. సీసీటీవీ ఫుటేజ్‌ ఆధారంగా ప్రస్తుతం పోలీసులు ఈ వికార చర్యకు పాల్పడిన యువతి ఫోటోలను విడుదల చేశారు. ఈ సంఘటన పెన్సిల్వేనియా వాల్‌మార్ట్‌ స్టోర్‌లో జరిగింది. మాల్‌ సిబ్బందికి ఫ్లోర్‌లో ఎవరో మూత్రవిసర్జన చేసినట్లు అనుమానం రావడంతో.. సీసీటీవీ ఫుటేజ్‌ పరిశీలించారు. దాంతో యువతి చేసిన చండాలం వెలుగు చూసింది.

ఈ సంఘటనపై మాల్‌ యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసింది. సీసీటీవీ ఫుటేజ్‌ ఆధారంగా సదరు యువతిని గ్రేస్‌గా గుర్తించారు పోలీసులు. అయితే ఆమెకు ఇలాంటి పనులు కొత్తేంకాదు అంటున్నారు పోలీసులు. పబ్లిక్‌ ప్రదేశాల్లో అసభ్యంగా ప్రవర్తించడం.. క్రమశిక్షణారాహిత్యం, అల్లర్లు సృష్టించడం వంటి కార్యక్రమాల్లో గ్రేస్‌ ఆరితేరిందంటున్నారు పోలీసులు. ఈ అంశాల్లో ఆమెపై పలు కేసులు కూడా నమోదయ్యాయని పేర్కొన్నారు. త్వరలోనే ఆమెను అరెస్ట్‌ చేస్తామని వెల్లడించారు. అయితే గ్రేస్‌ చర్యలపై నెటిజన్లు విరుచుకుపడుతున్నారు. ‘థూ.. నువ్వసలు మనిషివేనా.. నీ లాంటి వారికి మరణశిక్ష విధించాలి’ అంటూ కామెంట్‌ చేస్తున్నారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top