
హూస్టన్: అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో ఓ మహిళ ఒకే కాన్పులో ఆరుగురికి జన్మనిచ్చి అత్యంత అరుదైన గుర్తింపు సొంతం చేసుకుంది. ఒకేసారి ఆరుగురికి జన్మనివ్వడం 470 కోట్ల ప్రసవాల్లో ఒకరికే సాధ్యమవుతుందని అంచనా. హూస్టన్‌కు చెందిన తెల్మా చియాకా అనే మహిళ శుక్రవారం ఉదయం 4.50–4.59 గంటల మధ్య నలుగురు మగబిడ్డలు, ఇద్దరు ఆడ శిశువులను ప్రసవించిందని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. శిశువులు తక్కువ బరువుతో పుట్టడంతో వారికి కొంతకాలం అడ్వాన్స్‌డ్ చికిత్స కొనసాగుతుందని వైద్యులు చెప్పారు.