చంద్రుడిపై మరిన్ని అగాథాలు | Two 'young' craters discovered on Moon | Sakshi
Sakshi News home page

చంద్రుడిపై మరిన్ని అగాథాలు

May 25 2016 8:37 AM | Updated on Sep 4 2017 12:55 AM

చంద్రుడిపై మరిన్ని అగాథాలు

చంద్రుడిపై మరిన్ని అగాథాలు

చందమామపై మరో రెండు అగాథాలను శాస్త్రవేత్తలు తాజాగా కనుగొన్నారు.

వాషింగ్టన్: చందమామపై మరో రెండు అగాథాలను శాస్త్రవేత్తలు తాజాగా కనుగొన్నారు. మొదటి దాని వయస్సు 1.6 కోట్ల సంవత్సరాలు, రెండోదాని వయసు 7.5 కోట్ల సంవత్సరాలని నిర్ధారించారు. వీటిని కనుగొనడం వల్ల సౌరవ్యవస్థలో రాపిడుల గురించి మరిన్ని పరిశోధనలు నిర్వహించవచ్చని అమెరికా శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

ల్యాంప్, ఎల్‌ఆర్‌ఓ అనే ప్రాజెక్టుల్లో భాగంగా చంద్రుడిపై పరిశోధనలు నిర్వహించగా ఈ విషయం వెల్లడయింది. అయితే ఈ అగాథాలపై కాంతి పడకపోవడంతో వీటిపై అధ్యయనం క్లిష్టతరంగా మారిందని శాస్త్రవేత్తలు తెలిపారు. వీటిపై చిన్న చిన్న రాళ్లు, దుమ్ము కనిపించాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement