సంక్షోభంలో అతిపెద్ద ఎయిర్‌లైన్స్‌, విమానాలన్నీ రద్దు

Travelers stranded as UK's Monarch Airlines suspends flights

లండన్‌ : యూకేలో అతిపెద్ద ఎయిర్‌లైన్‌ సంస్థ మోనార్క్‌ సంక్షోభంలో కూరుకుపోయింది. సోమవారం నుంచి మోనార్క్‌ ఎయిర్‌లైన్స్‌ తన సేవలను నిలిపివేసింది. 3 లక్షల బుకింగ్స్‌ను కూడా ఈ ఎయిర్‌లైన్స్‌ రద్దు చేసింది. దీంతో విదేశాల్లో ఉన్న మోనార్క్‌ విమాన ప్రయాణికులు ఇరకాటంలో పడిపోయారు. విదేశాల్లో చిక్కుకుపోయిన లక్షకు పైగా మోనార్క్‌ ప్రయాణికులను జాగ్రత్తగా తిరిగి స్వదేశానికి తీసుకురావాలని సివిల్‌ ఏవియేషన్‌ అథారిటీ(సీఏఏ)ని బ్రిటీష్‌ ప్రభుత్వం ఆదేశించింది.  ఈ మేరకు వారిని వెనక్కి తీసుకురావడానికి సీఏఏ 30కి పైగా ఎయిర్‌క్రాఫ్ట్‌లను సిద్ధం చేసింది. మోనార్క్‌ విమానాలను, హాలిడేస్‌ను రద్దు చేస్తున్నట్టు ప్రకటించడం విచారకరమంటూ మోనార్క్‌ ట్విట్టర్‌ తన ద్వారా తన సేవల నిలిపివేతను ప్రకటించింది.

మోనార్క్‌ ప్రయాణికులు విమానశ్రయాలకు వెళ్లాల్సినవసరం లేదని, అక్కడ విమానాలు లేవంటూ పేర్కొంది. మోనార్క్‌ తీసుకున్న ఈ నిర్ణయం తన కస్టమర్లపై, ఉద్యోగులపై తీవ్ర ప్రభావం చూపుతుందని సీఏఏ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ ఆండ్రూ హైన్స్ చెప్పారు. యూరోపియన్‌ ఎయిర్‌లైన్స్‌తో తీవ్రకరమైన పోటీ, డ్రైవింగ్‌ కన్సాలిడేషన్ వంటి పలు కారణాలచే మోనార్క్‌ సేవలు స్తంభించిపోయాయి. మోనార్క్‌ తీసుకున్న ఈ నిర్ణయంపై సోషల్‌ మీడియా యూజర్లు సైతం విరుచుకు పడుతున్నారు. మోనార్క్‌కు ఆర్థికపరమైన సమస్యలు విపరీతంగా పెరిగిపోయాయని మోనార్క్‌ దివాలాపై నియమింపబడ్డ అకౌంటింగ్‌ సంస్థ కేపీఎంజీ చెప్పింది. 
 

Back to Top