హిల్లరీ ఓటమికి కారణం వారే! | they are blamed for Hillary Clinton's loss | Sakshi
Sakshi News home page

హిల్లరీ ఓటమికి కారణం వారే!

Dec 20 2016 7:18 PM | Updated on Apr 8 2019 8:11 PM

హిల్లరీ ఓటమికి కారణం వారే! - Sakshi

హిల్లరీ ఓటమికి కారణం వారే!

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో హిల్లరీ క్లింటన్‌ ఓటమికి 'యాంగ్రీ వైట్‌మెన్‌' కారణమన్నాడు బిల్‌ క్లింటన్‌.

న్యూయార్క్‌‌: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో హిల్లరీ క్లింటన్‌ ఓటమికి 'యాంగ్రీ వైట్‌మెన్‌' కారణమని అమెరికా మాజీ అధ్యక్షుడు, హిల్లరీ భర్త బిల్‌ క్లింటన్‌ పేర్కొన్నారు. సోమవారం న్యూయార్క్‌లోని వీక్లీ న్యూస్‌ పేపర్‌ 'రికార్డ్‌ రివ్యూ'తో మాట్లాడుతూ బిల్‌ క్లింటన్‌ ఈ వ్యాఖ్యలు చేశారు.

డొనాల్డ్‌ ట్రంప్‌కు పెద్దగా ఏమీ తెలియకున్నా.. యాంగ్రీ వైట్‌మెన్‌ ఓట్లు ఎలా గెలవాలో తెలుసు అని హిల్లరీ ఓటమి గురించి మాట్లాడుతూ బిల్‌ క్లింటన్‌ వ్యాఖ్యానించారు. అలాగే.. రష్యా హ్యాకింగ్‌, ఎఫ్‌బీఐ డైరెక్టర్‌ జేమ్స్‌ కోమి సైతం హిల్లరీ ఓటమికి కారణమని విశ్లేషించారు. ఎన్నికలకు రెండు వారాల ముందు హిల్లరీ ఈ మేయిల్స్‌ వ్యవహారంపై ఎఫ్బీఐ పునర్విచారణ అనడం ఖచ్చితంగా ఫలితాలపై ప్రభావం చూపిందని బిల్‌ క్లింటన్‌ స్పష్టం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement